te_tw/bible/kt/good.md

8.3 KiB
Raw Permalink Blame History

మంచిది, సరియైన, సంతోషకరమైన, మెరుగైన, శ్రేష్ఠమైన

నిర్వచనం:

"మంచిది" అనే పదానికి సందర్భాన్ని బట్టి వివిధ అర్థాలున్నాయి. అనేక భాషలు వివిధ అర్థాలను అనువదించడం కోసం వివిధ పదాలను ఉపయోగిస్తాయి.

  • సాధారణంగా, ఏదైనా దేవుని గుణ లక్షణాలకూ, ఉద్దేశాలకూ, చిత్తానికీ సరిపడినట్లయితే అది మంచిది అవుతుంది.
  • "మంచిది" అంటే సంతోషకరమైనది, శ్రేష్ఠమైనది, సహాయకరమైనది, సరిపడినది, లాభకరమైనది, లేదా నైతికంగా సరియైనది అని అర్థం.
  • "మంచి" దేశం అంటే "సారవంతం” లేక “ఫలభరితం" అని అర్థం.
  • "మంచి" పంట అంటే "సమృద్ధి" అయిన పంట అని అర్థం.
  • ఒక వ్యక్తి తను చేసిన దానిలో “మంచి" గా ఉండగలడు అంటే అతని కార్యాచరణలో గానీ లేదా వృత్తిలోగానీ నిపుణుడుగా ఉన్నాడని అర్థం. ఉదాహరణకు "మంచి రైతు" అనే వాక్యం.
  • బైబిలులో "మంచి" అనే పదానికి సాధారణ అర్థం తరచుగా "దుష్టత్వం" అనే దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
  • "మంచితనం" అంటే సాధారణంగా నైతికంగా మంచిగా ఉండడం లేదా తలంపులలోనూ, చర్యలలోనూ నీతిగా ఉండడం సూచిస్తుంది.
  • దేవుని మంచితనం అంటే ఆయన ప్రజలకు మంచివీ, ప్రయోజనకరమైన వాటిని అనుగ్రహించడం ద్వారా వారిని ఆశీర్వదించడానిని సూచిస్తుంది. ఇది అయన నైతిక పరిపూర్ణతను కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • లక్ష్య భాషలో "మంచిది" పదం కోసం సాధారణ పదాన్ని దాని సాధారణ అర్థం ఖచ్చితంగానూ, సహజంగానూ ఉన్న చోట ఉపయోగించాలి. ప్రత్యేకించి దుర్మర్గత పదానికి వ్యతిరేకంగా ఉన్న చోట ఉపయోగించాలి.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "దయగల” లేక “శ్రేష్ఠమైన" లేదా “దేవునికి సంతోషాన్ఆని కలిగించే" లేదా నీతిమంతుడు" లేదా “నైతికంగా న్యాయబద్ధమైన" లేదా “ప్రయోజనకరమైన" పదాలు ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "మంచి భూమి" పదం "సారవంతమైన భూమి" లేదా “ఫలవంతమైన భూమి" అని అనువదించబడవచ్చు; "మంచి పంట" పదం "సమృద్ధియైన పంట" లేదా "విస్తారమొత్తంలో పంట" అని అనువదించబడవచ్చు.
  • "మంచి చెయ్యడం" అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించేదేదైనా చెయ్యడం, "దయగలిగి యుండండి" లేదా "సహాయం చెయ్యండి" లేదా మరొకరికి "ప్రయోజనం చేకూర్చండి" అని అర్థం.
  • "విశ్రాంతి దినమున మంచి చెయ్యడం" అంటే "విశ్రాంతి దినమున ఇతరులకు సహాయం చేసే క్రియలు చెయ్యండి" అని అర్థం.
  • సందర్భాన్ని బట్టి, "మంచితనం" అనే పదం "ఆశీర్వాదం” లేదా “దయ” లేదా “నైతిక పరిపూర్ణత” లేదా “నీతి” లేదా “పవిత్రత" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: righteous, prosper, evil)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __1:4__దేవుడు తాను సృష్టించినదంతా మంచిది ఉన్నట్టు చూశాడు.
  • __1:11__దేవుడు మంచి చెడుల తెలివిని ఇచ్చే చెట్టును మొలిపించాడు.”
  • 1:12 తరువాత దేవుడు చెప్పాడు, "నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు."
  • 2:4"దేవుడు నీవు దీనిని తినినప్పుడు నీవు దేవుని వలే ఉంటావు, ఆయనకు వలే మంచి చెడుల తెలివిని కలిగి ఉంటావు."
  • 8:12 "మీరు దుష్ట తలంపుతో నన్ను బానిసగా అమ్మి వేశారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నాడు!"
  • 14:15

యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు విధేయత కలిగి దేవునికి లోబడ్డాడు.

  • 18:13 ఈ రాజులు కొందరు మంచి మనుషులు. న్యాయంగా పరిపాలన జరిగిస్తూ దేవుణ్ణి ఆరాధించినవారు.
  • 28:1

"మంచి బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి?" యేసు అతనితో చెప్పాడు. "నన్ను మంచి వాడని ఎందుకు పిలుస్తున్నావు?' మంచి వాడొక్కడే, ఆయన దేవుడు."

పదం సమాచారం:

  • Strongs: H0117, H0145, H0155, H0202, H0239, H0410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G00140, G00150, G00180, G00190, G05150, G07440, G08650, G09790, G13800, G20950, G20970, G21060, G21070, G21080, G21090, G21140, G21150, G21330, G21400, G21620, G21630, G21740, G22930, G25650, G25670, G25700, G25730, G28870, G29860, G31400, G36170, G37760, G41470, G46320, G46740, G48510, G52230, G52240, G53580, G55420, G55430, G55440