3.7 KiB
3.7 KiB
విడిచి పెట్టు, విడిచి పెట్టిన, విడువబడిన
నిర్వచనం:
"విడిచి పెట్టు" అంటే ఎవరినైనా వదిలి వెయ్యడం, లేక దేన్నైనా మానుకోవడం. "విడిచి పెట్టబడిన" అంటే ఒకరు వేరొకరిని వదిలెయ్యడం.
- ప్రజలు దేవుణ్ణి "విడిచి పెట్టడం" అంటే వారు ఆయనను వదిలి నమ్మక ద్రోహం చేశారు అని అర్థం.
- దేవుడు ప్రజలను "విడిచి పెట్టడం" అంటే అయన వారికి సహాయం చెయ్యడం మానుకున్నాడు. వారిని తిరిగి తన దగ్గరకు రప్పించడానికి వారు హింసలు అనుభవించేలా చేశాడు.
- ఈ పదానికి వేరొక అర్థం కూడా ఉంది. కొన్నిటిని త్యజించడం, అంటే దేవుని బోధలను వదిలిపెట్టడం, లేక అనుసరించక పోవడం.
- "విడిచి పెట్టిన" అనేదాన్ని భూత కాలంలో ఉపయోగిస్తారు. "అతడు నిన్ను విడిచి పెట్టాడు." లేక విడిచిపెట్ట బడిన ఎవరి గురించి అయినా చెప్పడానికి ఉపయోగిస్తారు.
అనువాదం సలహాలు:
- సందర్భాన్ని బట్టి ఈ పదం అనువదించడంలో ఇతర పద్ధతులు. "వదిలెయ్యడం” లేక “నిర్లక్ష్యం” లేక “చాలించుకోవడం” లేక “వదిలి వెళ్ళడం” లేక “దూరం వెళ్ళిపోవడం,"
- దేవుని చట్టాన్ని "విడిచి పెట్టు" అనే మాటను ఇలా అనువదించ వచ్చు " దేవుని చట్టం ధిక్కరించు." ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. దేవుని బోధలు, ఆజ్ఞలు "విడిచి పెట్టడం” లేక “చాలించుకోవడం” లేక “లోబడడం మానుకోవడం."
- "విడిచి పెట్టు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "పరిత్యజించు” లేక “వదిలి పెట్టు."
- విడిచి పెట్టేది వస్తువునా లేక మనిషినా అనే దాన్ని బట్టి అనువదించడంలో వివిధ పదాలు ఉపయోగించాలి.
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 06:11-13
- దానియేలు 11:29-30
- ఆది 24:26-27
- యెహోషువా 24:16-18
- మత్తయి 27:45-47
- సామెతలు 27:9-10
- కీర్తనలు 071:17-18
పదం సమాచారం:
- Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,