te_tw/bible/kt/fellowship.md

2.4 KiB
Raw Permalink Blame History

సహవాసం

నిర్వచనం:

సాధారణంగా, "సహవాసం" అంటే ఒకే విధమైన ఆసక్తులు అనుభవాలు గల వారి మధ్య ఉండే స్నేహ పూర్వకమైన కలయికలు.

  • బైబిల్లో, "సహవాసం" అనే మాట క్రీస్తు విశ్వాసుల కలయికను సాధారణంగా సూచిస్తున్నది.
  • క్రైస్తవ సహవాసం అంటే విశ్వాసుల మధ్య వారికి క్రీస్తు, పరిశుద్ధాత్మల మూలంగా ఉండే సంబంధం.
  • ఆది క్రైస్తవులు వారి సహవాసాన్ని దేవుని వాక్కు వినడం, కలిసి ప్రార్థన చేయడం వారికి ఉన్నవి కలిసి పంచుకోవడం కలిసి భోజనాలు చేయడం ద్వారా వ్యక్త పరిచే వారు.
  • క్రైస్తవులు క్రీస్తు తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగా దేవునికి, తమకు మధ్య అంతరం తొలగించినందువల్ల వారి విశ్వాసం మూలంగా దేవునితో సహవాసం ఏర్పరచుకుంటారు.

అనువాదం సలహాలు:

  • అనువదించే పద్ధతులు. "సహవాసం" అంటే "కలిసి పంచుకోవడం” లేక “సంబంధం కలిగి ఉండడం” లేక “స్నేహ సంబంధాలు” లేక “క్రైస్తవ సమాజం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2266, H8667, G28420, G28440, G33520, G47900