te_tw/bible/kt/faithless.md

5.2 KiB

విశ్వాసం లేని, విశ్వాస రాహిత్యం, అపనమ్మకత్వము

నిర్వచనం:

"విశ్వాసం లేని" అంటే విశ్వాసం లోపం లేక విశ్వసించక పోవడం.

  • దేవుని యందు విశ్వాసముంచని వారిని వర్ణించడానికి ఈ పదము ఉపయోగిస్తారు. వారి నమ్మకంలేమితనము వారు జరిగించు అనైతిక విధానాల్లో విశదం అవుతుంది/కనబడుతుంది.
  • ప్రవక్త యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలువారు విశ్వాసం లేకుండా దేవునికి అవిధేయత చూపుతున్నారని ఇశ్రాయేలువారి మీద నేరం మోపాడు.
  • వారు విగ్రహాలను ఆరాధించి నిజ దేవునిని ఆరాధించని లేదా లోబడని ప్రజల యొక్క దుష్ట ఆచారములను అనుసరించారు.

"నమ్మకద్రోహం/నమ్మదగని వారు" అనే పదము దేవుడు తమకు ఆజ్ఞాపించిన వాటిని చేయని వ్యక్తులను వివరిస్తున్నది. నమ్మకద్రోహం చేసే పరిస్థితి లేదా అభ్యాసం " అపనమ్మకత్వము".

  • ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు మరియు వారు ఇతర మార్గాల్లో దేవునికి అవిధేయత చూపినప్పుడు "నమ్మకద్రోహులు/అపనమ్మకస్తులు" అని పిలువబడ్డారు.
  • వివాహం జీవితంలో ఎవరైతే వ్యభిచారము చేస్తారో వారు తన భాగస్వామికి “అపనమ్మకస్తుడు” లేదా “అపనమ్మకస్తురాలు".
  • ఇశ్రాయేలు యొక్క అవిధేయత ప్రవర్తనను వివరించడానికి దేవుడు "అనమ్మకత్వం" అనే పదాన్ని ఉపయోగించాడు. వారు దేవునికి విధేయత చూపడం లేదు లేదా ఆయనను గౌరవించడం లేదు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "విశ్వాసం లేని" అనే దాన్ని "అపనమ్మకత్వం” లేక “విశ్వసించని” లేక “దేవునికి అవిధేయత” లేక “నమ్మని" అని అనువదించవచ్చు.
  • "విశ్వాసరాహిత్యం" అనే పదాన్ని "అపనమ్మకం” లేక “అపనమ్మకత్వం” లేక “తిరుగుబాటు వ్యతిరేకంగా దేవుడు." అని అనువదించవచ్చు.
  • "నమ్మదగని" అనే పదబంధాన్ని "దేవునికి నమ్మకమైన వ్యక్తులు కానివారికి” లేదా" “నమ్మకద్రోహులు” లేదా “దేవునికి అవిధేయత చూపించే వ్యక్తులు" లేదా "దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వ్యక్తులు" అని అనువదించవచ్చు.
  • కొన్ని భాషలలో, "అపనమ్మకం" అనే పదము "అవిశ్వాసం" అనే పదానికి సంబంధించినది.

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: విశ్వసించువిశ్వసనీయతధిక్కరించు, వ్యభిచారము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5710