te_tw/bible/kt/eunuch.md

2.2 KiB

నపుంసకుడు, నపుంసకులు

నిర్వచనం:

సాధారణంగా "నపుంసకుడు" అనే పదం వృషణాలు చితకగొట్టిన మనిషిని సూచిస్తున్నది. తరువాత ఈ పదం అన్ని రకాల ప్రభుత్వ అధికారులకు వాడడం మొదలయింది, వారికి ఎలాటి వైకల్యం లేకపోయినా.

  • యేసు చెప్పాడు, కొందరు నపుంసకులు గా పుడతారు. ఎందుకంటే వారి లైంగిక అవయవాలు మామూలుగా ఉండవు. లేక లైంగికంగా మామూలుగా పని చెయ్యవు. కొందరు బ్రహ్మచారులుగా ఉండిపోవడానికి నిర్ణయించుకుని నపుంసకుల వలే అవుతారు.
  • ప్రాచీన కాలంలో, నపుంసకులు తరచుగా రాజు సేవకులుగా, ముఖ్యంగా రాణివాసంలో ఉద్యోగులుగా ఉండేవారు.
  • కొందరు నపుంసకులు ప్రాముఖ్యమైన ప్రభుత్వ అధికారులుగా ఉండేవారు. అపోస్తలుడు ఫిలిప్పు ఎడారిలో కలుసుకున్న ఇతియోపీయ నపుంసకుడు ఇలాటివాడు.

(చూడండి: ఫిలిప్పు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5631, G2134, G2135