te_tw/bible/kt/ephod.md

2.2 KiB

ఏఫోదు

నిర్వచనం:

ఏఫోదు ఇశ్రాయేలు యాజకులు శరీరం ముందు భాగాన ధరించే వస్త్రాల్లో ఒకటి. దీనికి రెండు భాగాలు. ఎదుటి భాగం, వెనక భాగం. రెండు కలిసి భుజాల దగ్గర గుడ్డతో ముడి వేస్తారు.

  • ఒక రకం ఏఫోదును సాదా సన్న నార బట్టతో నేస్తారు. దీన్నిమామూలు యాజకులు ధరిస్తారు.
  • ప్రధాన యాజకుడు ప్రత్యేకంగా ధరించే ఏఫోదు అల్లిక పనితో బంగారం, నీలం, ఊదా రంగు, ఎరుపు నూలుతో చేస్తారు.
  • ప్రధాన యాజకుని ఛాతీకవచం ఏఫోదు మీద ధరిస్తారు. ఛాతీకవచం వెనక ఊరీము, తుమ్మీము, అనే రాళ్లు ఉంటాయి. వీటిని దేవుడు కొన్ని విషయాల్లో తన చిత్తం వెల్లడి చేసేలా అడగడానికి ఉపయోగిస్తారు
  • న్యాయాధిపతి గిద్యోను బుద్ధిహీనంగా బంగారంతో ఏఫోదు తయారు చేయించాడు. అది కాస్తా ఇశ్రాయేలీయులు ఆరాధించిన విగ్రహం అయి కూర్చుంది.

(చూడండి: యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H641, H642, H646