te_tw/bible/kt/daughterofzion.md

2.8 KiB

సీయోను కుమార్తె

నిర్వచనం:

"సీయోను కుమార్తె" అనే పదం ఇశ్రాయేలు మనుష్యులను సూచించడానికి ఒక అలంకారిక మార్గం. ఇది సాధారణంగా ప్రవచనాలలో ఉపయోగించబడుతుంది.

  • పాత నిబంధనలో, యెరూషలెం నగరానికి "సియోను" అనే పదం తరచుగా మరొక పేరుగా ఉపయోగించబడుతుంది.
  • ఇశ్రాయేలును సూచించడానికి “సియోను” మరియు “యెరూషలెం” అనే రెండు కూడా ఉపయోగించబడ్డాయి.
  • "కుమార్తె" అనే పదం ప్రేమను పుట్టించునది లేదా ఆప్యాయత సంబంధమైన పదం. దేవుడు తన ప్రజల పట్ల చూపే ఓర్పు మరియు శ్రద్ధకు ఇది ఒక రూపకం.

అనువాద సూచనలు:

  • దీన్ని అనువదించే మార్గాలలో “సీయోను నుండి నా కుమార్తె ఇశ్రాయేలు,” లేదా “సీయోను నుండి వచ్చిన మనుష్యులు నాకు కుమార్తె వంటివారు” లేదా “సియోను, నా ప్రియమైన ఇశ్రాయేలు మనుష్యులు” అని చేర్చవచ్చు.
  • బైబిలులో అనేక సార్లు ఉపయోగించబడినందున “సియోను”అనే పదాన్ని ఈ వ్యక్తీకరణలో ఉంచడం ఉత్తమం. దాని అలంకారిక అర్థాన్ని మరియు ప్రవచానాత్మక ఉపయోగాన్ని వివరించడానికి అనువాదంలో ఒక వివరణను చేర్చబడవచ్చు.
  • ఈ వ్యక్తీకరణ యొక్క అనువాదంలో “కుమార్తె” అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నంత వరకు ఉంచడం కూడా మంచిది.

(వీటిని కూడా చూడండి: [యెరూషలేం], [ప్రవక్త], [సియోను])

బైబిలు రిఫరెన్సులు:

  • [యిర్మీయా 6:2]
  • [యోహాను 12:15]
  • [మత్తయి 21:5]

పదం సమాచారమ:

  • Strong's: H1323, H6726