te_tw/bible/kt/cornerstone.md

3.2 KiB
Raw Permalink Blame History

మూలరాయి

నిర్వచనం:

ఈ పదం "మూలరాయి" ఒక భవనం నిర్మాణంలో పునాది మూలన ఒక ప్రత్యేకమైన చోటు కోసం చెక్కిన పెద్ద రాయిని సూచిస్తున్నది.

  • భవనంలోని మిగతారాళ్లన్నీ మూలరాయితో సంబంధించి మలుస్తారు.
  • ఇది కట్టడం మొత్తానికీ ప్రాముఖ్యత, బలం, సామర్థ్యం గల రాయి.
  • కొత్త నిబంధనలో, విశ్వాసుల సమావేశాన్ని రూపకాలంకారికంగాఒక భవనంగా పోల్చారు. దానికి యేసు క్రీస్తు "మూలరాయి."
  • అదే విధంగా భవనం మూలరాయి భవనం అంతటికీ ఆధారంగా ఉండి మొత్తం భవనం ఆకృతిని నిర్ణయిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు మూలరాయిగా విశ్వాసులు సంఘానికి పునాదిగా ఆధారంగా ఉంది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని "ముఖ్య భవనం రాయి” లేక “పునాది రాయి." అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • లక్ష్య భాషలో ముఖ్య ఆధారంగా పునాదిగా ఉండే దాన్ని సూచించే పదం ఉందేమో చూడండి. అలా ఉంటే ఆ పదాన్ని ఉపయోగించ వచ్చు.
  • దీన్ని అనువదించే మరొక పద్ధతి, "భవనం మూల పునాది రాయిగా వాడే రాయి."
  • భవనం కోసం వాడిన రాళ్ళలో దృఢమైన, భద్రమైన పెద్ద రాయిని దీనికోసం ఉపయోగిస్తారు అని గుర్తు పెట్టుకోవడం ప్రాముఖ్యం

భవనం నిర్మించడానికి రాళ్లు ఉపయోగించక పోతే ఇక్కడ మరొకపదం ఉపయోగించాలి. "పెద్ద రాయి" ("బండ రాయి"). అయితే అందులో చక్కగా అమిరే రాయి, దాని కోసమే ప్రత్యేకంగా చేసినది అనే అర్థం రావాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0068, H6438, H7218, G02040, G11370, G27760, G30370