te_tw/bible/kt/conscience.md

2.8 KiB

మనస్సాక్షి

నిర్వచనం:

మనస్సాక్షి ఒక వ్యక్తి యొక్క ఆలోచనలో ఒక భాగం, దీని ద్వారా అతడు పాపకార్యాన్ని చేస్తున్నప్పుడు దాని గురించిన అవగాహన కలిగిస్తూ ఉన్నాడు.

  • మనుషులు మంచిది ఏమిటి మరియు చెడ్డది ఏమిటి అనే దాని మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో సహాయపడడానికి దేవుడు వారికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు.
  • దేవుడు చెప్పిన దానికి విధేయత చూపే వ్యక్తి "పవిత్రమైన” లేదా “స్పష్టమైన” లేదా “శుద్ధమైన" మనస్సాక్షిని కలిగియున్నాడని చెప్పబడుతుంది.
  • ఒక వ్యక్తి "నిర్మలమైన మనస్సాక్షి" కలిగి ఉన్న యెడల అతడు ఎలాటి పాపాన్ని దాచుకోవడం లేదు అని అర్థం.
  • ఎవరైనా తమ మనస్సాక్షిని అలక్ష్యం చేసినట్లయితే మరియు అతడు పాపం చేసినప్పుడు ఎలాటి దోషభావాన్ని అనుభూతి చెందనట్లయితే అతని మనస్సాక్షి చెడు విషయంలో ఇకమీదట సున్నితంగా ఉండదని అర్థం. బైబిలు దీనిని వేడి ఇనుము వలే "వాతవేయబడిన" మనస్సాక్షి అని పిలుస్తుంది. అటువంటి మనస్సాక్షి "మొద్దుబారినది," "కలుషితమైనది" అని కూడా పిలువబడుతుంది.
  • ఈ పదాన్నిఅనువదించడానికి సాధ్యమయ్యే విధానాలలో "అంతరంగ నైతిక మార్గదర్శిని” లేదా “నైతిక ఆలోచన" అని ఉండవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

  • 1 తిమోతి 01:19
  • 1 తిమోతి 03:09
  • 2 కొరింథీ 05:11
  • 2 తిమోతి 01:03
  • రోమా 09:01
  • తీతు 01:15-16

పదం సమాచారం:

  • Strong's: G4893