te_tw/bible/kt/compassion.md

2.7 KiB
Raw Permalink Blame History

కరుణ, కరుణ గల

నిర్వచనం:

ఈ పదం "కరుణ" అనేది మనుషుల పట్ల సానుభూతిని సూచిస్తున్నది, ముఖ్యంగా బాధల్లో ఉన్న వారి పట్ల. "కరుణ గల" వ్యక్తి ఇతరుల విషయం జాలి పడి సహాయం చేస్తాడు.

  • ఈ పదం "కరుణ" సాధారణంగా అవసరంలో ఉన్న మనుషుల గురించి శ్రద్ధ వహించి సాయపడడాన్ని తెలియ జేస్తుంది.
  • బైబిల్ లో దేవుడు కరుణ గలవాడని, అయన ప్రేమ కరుణ పూర్ణుడు అని చెబుతున్నది.
  • పౌలు కొలస్సి సంఘానికి రాసిన లేఖలో, వారు "కరుణను వస్త్రంగా ధరించుకోవాలని" చెప్పాడు. వారు అవసరంలో ఉన్న మనుషులకు చురుకుగా సహాయం చేస్తూ ఉండాలని చెప్పాడు.

అనువాదం సూచనలు:

  • అక్షరార్థం "కరుణ" అంటే "కడుపులో కరుణ" కలిగి ఉండడం. ఈ మాటకు అంటే "కనికరం” లేక “దయ" అని కూడా అర్థం. ఇతర భాషల్లో ఈ అర్థం ఇచ్చే వారి స్వంత అనే మాటలు ఉండవచ్చు.
  • "కరుణ" అనే మాట అనువదించడంలో, "లోతైన సానుభూతి” లేక “సహాయం చేసే కరుణ" అనే అర్థాలు రావాలి.
  • ఈ పదాన్ని "కరుణ గల" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "శ్రద్ధ గలిగి సహాయకరంగా ఉండడం” లేక “లోతైన ప్రేమ, జాలి" కనుపరచడం.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2550, H7349, H7355, H7356, G16530, G33560, G36270, G46970, G48340, G48350