4.3 KiB
4.3 KiB
డంబం, డంబముగా ఉండడం
నిర్వచనం:
ఈ పదం "డంబాలు"అంటే దేన్నైనా, ఎవరినైనా ఉద్దేశించి గర్వం మాటలు పలకడం. దీని అర్థం తరచుగా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం.
·* "డంబాలు పలుకు"వాడు తన గురించి గర్వంగా మాట్లాడతాడు.
- ఇశ్రాయేలీయులు వారి విగ్రహాల గురించి "డంబాలు చెప్పుకుంటున్నందుకు" దేవుడు వారిని గద్దించాడు. వారు నిజ దేవుని స్థానంలో అహంకారంగా అబద్ధ దేవుళ్ళను ఆరాధించారు.
- ప్రజలు వారి సంపద, వారి బలం, వారి సారవంతమైన భూములు, వారి చట్టాలు గురించి డంబాలు పలకడం గురించి బైబిల్ చెబుతున్నది. అంటే వారు ఈ విషయాల గురించి గర్వంగా మాట్లాడుతూ వాటన్నిటినీ ఇచ్చింది దేవుడేనని గుర్తించడం లేదు.
- దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి "అతిశయాలు," గర్వం మాటలు అయన తమకు తెలుసు అనే దాన్ని బట్టి వారు పలకాలి.
- అపోస్తలుడైన పౌలు కూడా ప్రభువులో అతిశయించాలని చెబుతున్నాడు. అంటే దేవుడు వారికి చేసిన దానంతటిని బట్టి వారు సంతోషంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి.
అనువాదం సూచనలు:
- "డంబాలు"అనే దాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "డప్పాలు” లేక “గర్వపు మాటలు” లేక “గర్వంగా ఉండడం."
- ఈ పదం "డంబాలు పలుకు"అనే మాటను ఒక పదం లేక పదబంధం తో అనువదించడం ఎలా అంటే "గర్విష్టి మాటలతో నిండిపోయి” లేక “అహంభావం” లేక “తన గురించి గర్వంగా మాట్లాడడం."
- దేవుణ్ణి గురించి ఎరిగినందువల్ల అతిశయించే సందర్భంలో దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గర్వపడు” లేక “ఆనందించు” లేక “దాన్ని బట్టి ఎంతో ఆనందించి” లేక “దాని విషయం దేవునికి కృతఙ్ఞతలు చెప్పి."
- కొన్ని భాషల్లో నకారాత్మకమైన గర్వానికి, మంచి గర్వానికి వేరు వేరు మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఒకటి అహంకారి. రెండవది అనుకూల పదం. తన కుటుంబం, పని, దేశం గురించి గర్వంగా భావించడం.
అనువాదం సూచనలు:
(చూడండి:proud)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H1984, H3235, H6286, G02120, G02130, G17400, G26200, G27440, G27450, G27460, G31660