te_tw/bible/other/walk.md

5.0 KiB

నడవడం, నడిచెను

నిర్వచనం:

“నడవడం” అనే ఈ పదము తరచుగా “జీవించడం” అని అర్థమునిచ్చే అలంకారిక భావనలో ఉపయోగించబడింది.

  • “హానోకు దేవునితో నడిచెను” అంటే హానోకు దేవునితో చాలా దగ్గరగా జీవించాడు అని అర్థం.
  • “ఆత్మ ద్వారా నడిపించబడుట” అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, తద్వారా దేవుణ్ణి సంతోషపరచేవీ, ఆయనను మహిమపరచే కార్యాలు చేస్తాము.
  • దేవుని ఆజ్ఞలలో లేక దేవుని మార్గములలో “నడచుట” అనగా ఆయన అజ్ఞలకు “విధేయత చూపుతూ జీవించుట” అని అర్థం, అంటే “ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం” లేదా “ఆయన చిత్తమును చేయడం” అని అర్థం.
  • దేవుడు తన ప్రజల “మధ్య నడచును” అని చెప్పినప్పుడు, ఆయన వారి మధ్య నివసించుచున్నాడనీ లేదా వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగియున్నాడనీ అర్థం.
  • “విరుద్ధముగా నడుచుకొనుట” అంటే దేనికైనా లేదా ఎవరికైనా వ్యతిరేకంగా జీవించడం లేదా ప్రవర్తించడం అని అర్థం.
  • “అనుసరించి నడవడం” అంటే దేనినైనా లేదా ఎవరినైనా వెదకడం లేదా అనుసరించడం అని అర్థం. ఒకరు నడచుకొనినట్లుగా జీవించడం అనే అర్థం కూడా ఉంది.

తర్జుమా సలహాలు:

  • “నడువడం” అనే పదం అక్షరార్థముగానే అనువదించబడడం ఉత్తమం, అయితే ఈ పదం యొక్క సరియైన భావం అర్థం కావాలి.
  • లేకపోతే, “నడువడం” అనే పదం అలంకారిక ఉపయోగాలు "జీవించడం" లేదా "క్రియ చెయ్యడం" లేదా "ప్రవర్తించడం" చేత కూడా అనువదించబడవచ్చు.
  • “అత్మచేత నడిపించబడుట” అనే వాక్యం “పరిశుద్ధాత్మకు విధేయతలో జీవించడం" లేదా "పరిశుద్ధాత్మకు సంతోషాన్ని కలిగించేలా విధంగా ప్రవర్తించడం" లేదా "పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవునికి సంతోషాన్ని కలిగించే కార్యాలు చెయ్యడం" అనే వాక్యాల చేత అనువదించబడవచ్చు.
  • “దేవుని ఆజ్ఞలలో నడువడం” అనే వాక్యం “దేవుని ఆజ్ఞల చేత జీవించడం" లేదా "దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం" అని అనువదించబడవచ్చు.
  • “దేవునితో నడిచెను" పదబంధం “దేవునికి విధేయత చూపడం, ఆయనను ఘనపరచడం ద్వారా దేవునితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగియుండడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్ముడు, ఘనత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1869, H1979, H1980, H1981, H3212, H4108, H4109, G1330, G1704, G3716, G4043, G4198, G4748