te_tw/bible/other/snow.md

3.5 KiB

మంచు, మంచు కురిసెను, మంచు కురియుట

వాస్తవాలు:

“మంచు” అనే పదము వాతావరణము చల్లగా ఉన్న ప్రాంతాలలో మేఘాలనుండి క్రింద పడే మంచు నీటినుండి రాలి పడే తెల్లని బిందువులు లేక దూదిని పోలిన మంచును సూచిస్తుంది.

  • మంచు ఇశ్రాయేలులోని ఎత్తైన స్థలాలో కురుస్తుంది, కాని అ మంచు ఎక్కువ సమయము నేల మీద ఉండదు. పర్వత శిఖరాల మీద ఎక్కువ కాలము మంచు మిగిలియుంటుంది. పరిశుద్ధ గ్రంథములో మంచు కలిగిన పర్వతముగా లెబానోను పర్వతము ఒక ఉదాహరణగా మిగిలియున్నది.
  • తెల్లగా ఉండేది అనేకమార్లు మంచు రంగకు పోల్చి చూసినప్పుడు అదే రంగును కలిగియున్నది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథములో యేసు ధరించిన వస్త్రములు మరియు ఆయన వెంట్రుకలు “మంచువలె తెల్లగా” ఉన్నాయని వివరించబడియుండెను.
  • మంచు తెల్లదనం కూడా పవిత్రతకు మరియు శుద్ధతకు గురుతుగా ఉన్నది. ఉదాహరణ, మన “పాపములు మంచువలె తెల్లగా ఉంటాయి” అనే మాటకు దేవుడు సంపూర్ణముగా తన ప్రజల పాపములనుండి వారిని కడిగివేశాడని దాని అర్థము.
  • కొన్ని భాషలు బహుశ మంచును “ఘనీభవించిన వానగా” లేక “మంచు రేకలు” లేక “ఘనీభవించిన రేకులు” అని సూచించును.
  • “మంచు నీరు” అనేది కరిగిన మంచునుండి వచ్చే నీటిని సూచించును.

(దీనిని చూడండి: తెలియని వాటిని తర్జుమా ఎలా చేయాలి)

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: లెబానోను, పవిత్రత)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7949, H7950, H8517, G5510