te_tw/bible/other/sleep.md

3.8 KiB

నిద్రలోనికి, నిద్రలోనికి జారుట, నిద్రలోనికి జారిపోవుట, నిద్రలో జారుకొనెను, నిద్రించు, నిద్రింపజేయును, నిద్రపోఎను, నిద్రపోవుట, నిద్రించువాడు, నిద్రలేకయుండుట, నిద్ర మత్తుగా

నిర్వచనము:

ఈ పదాలన్నియు మరణానికి సంబంధించి అలంకారిక అర్థములను కలిగియుంటాయి.

  • “నిద్రించుటకు” లేక “నిద్రలో ఉండుట” అనే పదాలకు “మరణించియుండుట” అని అర్థము కలదు. (చూడండి: రూపకలంకారము)
  • “నిద్రలోనికి జారుకొనుట” అనే ఈ మాటకు నిద్రపోవుటకు ఆరంభించు, లేక అలంకారికముగా మరణించు అని అర్థము కలదు.
  • “ఒకని తండ్రుల యెద్ద పడుకో” అనే మాటకు ఒకని పితరులు మరణించినట్లుగా మరణించు, లేక ఒకని పితరులు మరణించినట్లుగా మరణించు అని అర్థము కలదు.

తర్జుమా సలహాలు:

  • “నిద్రలోనికి జారుకొనుట” అనే ఈ మాటకు “ఆకస్మికముగా నిద్రపోవుట” లేక “ఇక నిద్రపో” లేక “మరించుట” అని సందర్భానుసారముగా అర్థము కలవు.
  • గమనించండి: ప్రేక్షకులు అర్థమును గ్రహించనప్పుడు కొన్ని సందర్భాలలో అలంకారిక మాటను ఉపయోగించుట ప్రాముఖ్యము. ఉదాహరణకు, లాజరు “నిద్రించుచున్నాడు” అని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు, లాజరు కేవలము నిద్రించుచున్నాడు అని వారు తలంచిరి. ఈ సందర్భములో చెప్పబడిన ఈ మాట “అతను చనిపోయాడు” అని తర్జుమా చేయుటకు అవకాశము ఇవ్వదు.
  • కొన్ని భాషలలో మరణము లేక మరణించుట అనే పదాలకు వేరొక పదాలు ఉండవు, ఆలాంటప్పుడు “నిద్రించు” లేక “నిద్రలోనికి జారుట” అనే పదాలను ఉపయోగించినప్పుడు ఎటువంటి అర్థము ఉండదు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1957, H3462, H3463, H7290, H7901, H8139, H8142, H8153, H8639, G879, G1852, G1853, G2518, G2837, G5258