te_tw/bible/other/siege.md

2.9 KiB

ముట్టడి, ముట్టడించు, ముట్టడి వేయబడినది, ముట్టడిదారులు, ముట్టడి వేయుట, ముట్టడి వేయు పనులు

నిర్వచనము:

“ముట్టడి” అనేది సైన్యము పట్టణపు చుట్టూ దాడి చేస్తున్నప్పుడు జరుగుతుంది మరియు ఎటువంటి ఆహార పదార్థములు సరఫరా జరగకుండా ఆపుతుంది. పట్టణమును “ముట్టడించుట” లేక “ముట్టడి క్రింద దానిని ఉంచుట” అనగా ముట్టడి ద్వారా దానిని దాడి చేయుట అని అర్థము.

  • బబులోనీయులు ఇశ్రాయేలు మీద దాడి చేయుటకు వచ్చినప్పుడు, యెరూషలేములోని ప్రజలందరని బలహీనపరచుటకు ఆ పట్టణమును ముట్టడి వేయు ఎత్తుగడను ఉపయోగించుదురు.
  • అనేకమార్లు ముట్టడి వేయు సమయములో పట్టణము మీద దాడి చేయుటకు మరియు పట్టణపు గోడలను దాటి వెళ్ళుటకు దాడి చేయు సైన్యమును బలపరచుటకు దుమ్ముతో నిండిన వాలు ప్రాంతములను క్రమంగా నిర్మించియుండేవారు.
  • పట్టణమును “ముట్టడివేయుట” అను మాటను దానికి “ముట్టడి వేయండి” లేక దాని మీద “ముట్టడిని జరిగించండి” అని కూడా చెప్పుదురు.
  • “ముట్టడి వేయబడెను” అనే మాట “ముట్టడి క్రింద” అనే మాటవలెనే అర్థమును కలిగియుండును. ఈ రెండు మాటలూ శత్రు సైన్యము వచ్చి ముట్టడి చేయబడిన పట్టణమును గూర్చి వివరించుచున్నది.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4692, H4693, H5341, H5437, H5564, H6693, H6696, H6887