te_tw/bible/other/sandal.md

2.2 KiB

చెప్పు, చెప్పులు

నిర్వచనము:

చెప్పు అనగా మడిమకు లేక పాదముకు చుట్టూ అతుక్కొనునట్లు చేసే వారల ద్వారా పాదముకు రక్షగా తయారు చేయబడిన సాధారణమైన పాదరక్ష అని చెప్పవచ్చును. చెప్పులను స్త్రీ పురుషులు ఇరువురు ధరించుకొందురు.

  • ఆస్తిపాస్తులులాంటివి అమ్ముచున్నప్పుడు న్యాయబద్ధమైన వ్యవహారమును నిశ్చయించుటకు కొన్నిమార్లు చెప్పును ఉపయోగించేవారు: ఒక మనిషి తన చెప్పును తీసికొని ఇంకొక వ్యక్తికి ఇచ్చేవాడు.
  • ఒకరు తమ చెప్పులను గాని లేక బూట్లనుగాని ఇప్పడము అనునది కూడా గౌరవమునకు సూచనయైయున్నది, ప్రత్యేకముగా దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోరు.
  • నేను యేసు చెప్పుల వారను ఇప్పుటకైనను యోగ్యుడను కాను అని యోహాను చెప్పెను, ఇటువంటి పని చాలా తక్కువగా ఎంచే బానిసలు లేక సేవకులు చేసేవారు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5274, H5275, H8288, G4547, G5266