te_tw/bible/other/renown.md

4.1 KiB

ప్రసిద్ధి, ప్రసిద్ధి చేయబడినది

నిర్వచనము:

“ప్రసిద్ధి” అనే ఈ పదము పూజింపదగిన గౌరవ మర్యాదను మరియు ఖ్యాతినొందిన గొప్పతనమును సూచిస్తుంది. ఏదైనా లేక ఎవరైనా ప్రసిద్ధిగాంచినవారైతే, వారిని లేక దానిని “ప్రసిద్ధిచెందినది/ప్రసిద్ధిచెందినవారు” అని పిలువబడును.

  • “ప్రసిద్ధిచెందిన” ఒక వ్యక్తి ఎంతో విలువైనవాడని మరియు బాగుగా ఎరిగిన వ్యక్తి అని అర్థము.
  • “ప్రసిద్ధి” అనునది విశేషముగా అతి ఎక్కువ కాలముపాటు అనేక చోట్ల మంచి గుర్తింపును సూచించును.
  • “ప్రసిద్ధిచెందిన” ఒక పట్టణము అనేకమార్లు దాని సంపద మరియు అభివృద్ధికి మారుపేరుగా ఉండును.

తర్జుమా సలహాలు:

  • “ప్రసిద్ధి” అనే ఈ పదమును “కీర్తి” లేక “గౌరవప్రదమైన గుర్తింపు” లేక “అనేకమంది ప్రజల ద్వారా కొనియాడబడుతున్న గొప్పతనము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ప్రసిద్ధిచెందిన” అనే ఈ పదమును “బాగుగా ఎరిగిన మరియు అతి ఉన్నతమైన కీర్తి” లేక “అద్భుతమైన గుర్తింపును కలిగియుండడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఇశ్రాయేలులో ప్రభువు నామము ప్రసిద్ధిచెందునుగాక” అనే ఈ మాటను “ఇశ్రాయేలు ప్రజలు ద్వారా ప్రభువు నామము గౌరవించబడాలి మరియు బాగుగా కొనియాడబడాలి” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ప్రసిద్ధి చెందిన పురుషులు” అనే ఈ మాటను “పురుషులు వారి ధైర్యమునకు ప్రసిద్ధిచెందినవారు” లేక “కీర్తినొందిన వీరులు” లేక “ఉన్నత గౌరవముగల మనుష్యులు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “అన్ని తరముల ద్వారా మీ ప్రసిద్ధిచెందును” అనే ఈ మాటను “తరతరములు ప్రజలు మీ గొప్పతనమును గూర్చి విందురు” లేక “మీ గొప్పతనమును కనులార గాంచెదరు మరియు ప్రతి తరములోను ప్రజల ద్వారా మీ కీర్తిని గూర్చి విందురు” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: ఘనత)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1984, H7121, H8034