te_tw/bible/other/pit.md

2.3 KiB

గుంట, గుంటలు, ఊహించని ఉపద్రవము

నిర్వచనము:

గుంట అనునది నేల మీద త్రవ్వి తీసే లోతైన రంధ్రం.

  • ప్రజలు నీటి కొరకు లేక జంతువులను పట్టుకొను ఉద్దేశము కొరకు అనేకమైన గుంటలను త్రవ్వుదురు.
  • గుంటను తాత్కాలికముగా ఖైదిని ఉంచడానికి కూడా ఉపయోగించేవారు.
  • కొన్నిమార్లు “గుంట” అనే పదము సమాధిని లేక నరకమును సూచిస్తుంది. మరికొన్నిమార్లు ఇది “అగాధమును” కూడా సూచిస్తుంది.
  • చాలా లోతైన గుంటను “నీటి తొట్టి” అని కూడా అంటారు.
  • “గుంట” అనే పదమును అలంకార భాషలో కూడా ఉపయోగించారు, ఉదాహరణకు, “నాశనమనే గుంట” అనే వాక్యము ఘోరమైన పరిస్థితిలో ఇరుక్కొని ఉండుట లేక పాప స్వభావములో అతీ ఎక్కువగా నిమగ్నమైయుండుటను, నాశనకరమైన ఆలువాట్లలో మునిగియుండుటను వివరిస్తుంది.

(ఈ పదములను కూడా చుడండి: అగాధము, నరకము, చెర)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H875, H953, H1356, H1360, H1475, H2352, H4087, H4113, H4379, H6354, H7585, H7745, H7816, H7825, H7845, H7882, G12, G999, G5421