te_tw/bible/other/pig.md

2.6 KiB

పంది, పందులు, పంది మాంసము, వరహము

నిర్వచనము:

పంది అనునది మాంసము కొరకు పెంచే నాలుగు కాళ్ళున్న డెక్కలుగల ఒక విధమైన ప్రాణి. దీని మాంసమును “పంది మాంసము” అని అందురు. పందులకు మరియు పందులకు సంబంధించిన ప్రాణులకు ఉపయోగించే మరొక పదము “వరహము” అయ్యున్నది.

  • పంది మాంసము తినవద్దని మరియు దానిని అశుభ్రమైన జంతువుగా ఎంచమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. యూదులు ఈ రోజు వరకు ఇంకనూ పంది మాంసమును తినరు మరియు దానిని అపరిశుద్ధమైన ప్రాణియని ఎంచుదురు.
  • ప్రజలకు మాంసముగా అమ్ముటకు పందులన్నిటిని సాకి పెంచుతారు.
  • ఒక రకమైన పంది ఉంది, దీనిని సాకరు గాని, ఇది అడవులలో జీవిస్తూ ఉంటుంది; దీనిని “అడవి పంది” అని పిలిచెదరు. అడవి పంది దంతాలను కలిగియుంటుంది మరియు దీనిని అత్యంత అపాయకరమైన ప్రాణి అని కూడా పరిగణిస్తారు.
  • మరికొన్నిమార్లు పెద్ద పెద్ద పందులను “సూకరములు” అని కూడా పిలుస్తారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: నిర్మలము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2386, G5519