te_tw/bible/other/pierce.md

2.5 KiB

పొడుచుట, పొడుచును, పొడవబడెను, పొడుచుచుండుట

నిర్వచనము:

“పొడుచుట” అను పదమునకు పదనుగల ఒక వస్తువుతో దేనినైనా గుచ్చుట అని అర్థము. ఎవరినైనా భావోద్వేగాలుకు గురిచేయుటను సూచించుటకు ఈ పదమును అలంకారికముగాను ఉపయోగించిరి.

  • యేసును సిలువలో వ్రేలాడదీసినప్పుడు ఒక సైనికుడు ఆయన ప్రక్కలో పొడుస్తాడు.
  • పరిశుద్ధ గ్రంథ కాలములలో స్వాతంత్ర్యమును పొందిన ఒక బానిస తన యజమానుని కొరకు పనిచేయుటను కొనసాగిస్తున్నాడని చెప్పుటకు తన చెవిని కుట్టించుకొనవలెను.
  • ఖడ్గం ఆమె హృదయమును పొడుచును అని సుమెయోను మరియకు చెప్పినప్పుడు ఆయన ఆ మాటను అలంకారముగా ఉపయోగించియుండెను, ఈ మాటకు అర్థము ఏమనగా ఆమె చాలా తీవ్రమైన బాధను అనుభవిస్తుంది ఎందుకంటే ఆమెకు యేసు అనే కుమారుడు జన్మించుబోవుచున్నాడు కాబట్టి ఆ వేదన ఆమెకు కలుగును.

(ఈ పదములను కూడా చుడండి: సిలువ, యేసు, దాసుడు, సుమెయోను)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H935, H1856, H2342, H2490, H2491, H2944, H3738, H4272, H5181, H5344, H5365, H6398, G1330, G1338, G1574, G2660, G3572, G4044, G4138