te_tw/bible/other/perfect.md

3.1 KiB

పరిపూర్ణము, పరిపూర్ణమైనది, పరిపూర్ణుడు, పరిపూర్ణత, పరిపూర్ణముగా

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో “పరిపూర్ణము” అనే పదమునకు మన క్రైస్తవ జీవితములో పరిపక్వత కలిగియుండుట అని అర్థము. దేనినైనా పరిపూర్ణముగా చేయాలంటే అది ఎటువంటి లోపాలు లేకుండా అద్భుతమైనదిగా తీర్చదిద్దబడునంతవరకు పనిచేయుట అని దాని అర్థము.

  • పరిపూర్ణముగాను మరియు పరిపక్వత కలిగియుండుట అనగా క్రైస్తవుడు ఎటువంటి పాపము లేకుండా విధేయత కలిగియుండుట అని అర్థము.
  • “పరిపూర్ణము” అనే పదముకూడా “సంపూర్ణత” లేక “సమస్తము” కలియుండుట అని అర్థము కలదు.
  • క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక అను పుస్తకములో ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణము చేయనివ్వండి, అప్పుడు ఒక విశ్వాసిలో పరిణితి కలుగుతుంది అని చెప్పుచున్నది.
  • క్రైస్తవులు బైబిలును అధ్యయనము చేసి, దానికి లోబడినప్పుడు వారు మరియేక్కువగా ఆత్మీయ అవగాహనను కలిగియుంటారు మరియు పరిపక్వత కలిగుంటారు. ఎందుకంటే వారు తమ ప్రవర్తనలో క్రీస్తువలే ఉంటారు.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును “లోపాలులేని” లేక “తప్పులులేని” లేక “మచ్చలేని” లేక “తప్పులేకుండా” లేక “ఎటువంటి తప్పులు కలిగియుండకుండ” అని తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H724, H998, H1584, H1585, H3632, H3634, H4357, H4359, H4512, H8003, H8502, H8503, H8535, H8537, H8549, H8552, G195, G197, G199, G739, G1295, G2005, G2675, G2676, G2677, G3647, G5046, G5047, G5048, G5050, G5052