te_tw/bible/other/partial.md

2.9 KiB

పాక్షికం, పాక్షికంగా ఉండు, పక్షపాతము

నిర్వచనము:

“పాక్షికంగా ఉండు” మరియు “పక్షపాతము చూపించు” అను మాటలు ఇతర ప్రజలకంటే కేవలము నచ్చిన కొంతమందిని మాత్రమె చాలా ప్రాముఖ్యముగా ఎంచుటను సూచించును.

  • ఈ పదమును అభిమానమును చూపించే అను మాటకు పర్యాయ పదముగా ఎంచవచ్చు, అనగా ఇతరులకంటే కొంతమందిని బాగుగా ఎక్కువగా చూసుకోవడము అని అర్థము.
  • సహజముగా పక్షపాతము లేక అభిమానము అనునది ప్రజలకు చూపించే చర్య, ఎందుకంటే వారు ఇతర జనులకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించినవారు లేక ఎక్కువ శ్రీమంతులు గనుక.
  • అయితే, జనుల స్థితిగతులను బట్టి లేక జనులు శ్రీమంతులని వారికి పక్షపాతముగాని లేక అభిమానముగాని చూపించవద్దని పరిశుద్ధ గ్రంథము తన ప్రజలకు ఆజ్ఞాపించియున్నది.
  • పౌలు రోమియులకు వ్రాసిన పత్రికలో దేవుడు ఎటువంటి పక్షపాతము లేకుండా జనులందరికి ఒకే విధముగానే తీర్పు తీర్చునని వ్రాయబడియున్నది.
  • జనులు శ్రీమంతులైనందున వారికి మంచి ఆసనములను లేక వారిని ఇతరులకంటే బాగుగా చూసుకోవడం తప్పని యాకోబు పత్రిక బోధించుచున్నది.

(ఈ పదాలను కూడా చూడండి: దయ చూపించడం)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H5234, H6440, G991, G1519, G2983, G4299, G4383