te_tw/bible/other/multiply.md

2.9 KiB

హెచ్చవేయు(విస్తరించు), హెచ్చవేయడం, హెచ్చవేసినది, హెచ్చించడం, గుణకారం

నిర్వచనం:

“విస్తరించు” అంటే సంఖ్యలో గొప్పగా వృద్దిచెందడం అని అర్థం. డబ్బు విషయం వృద్ధిని కలిగించే విధానం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది, విస్తరించడానికి వేదనను కలిగిస్తుంది.

  • జంతువులనూ, మనుస్యులనూ “విస్తరించాలననీ,” భూమిని నిండించాలనీ దేవుడు చెప్పాడు. వారి జాతిని మరింతగా పునరుత్పత్తి చెయ్యాలని ఆజ్ఞ.
  • 5,000 ప్రజలను పోషించదానికి యేసు రొట్టెను, చేపనూ విస్తరింపచేసాడు. ప్రతీ ఒక్కరికి చాలినంత ఆహారం ఉండేలా ఆహారం వృద్ధిచెందుతూ ఉంది.
  • సందర్భాన్నిబట్టి, ఈ పదాన్ని “వృద్ధిచెందడం” లేక “వృద్ధిచెందేలా చెయ్యడం” లేక “సంఖ్యలో అధికంగా వృద్ధిచెందడం” లేక “సంఖ్యలో అధికం కావడం” లేక “అసంఖ్యాకంగా కావడం” అని అనువదించవచ్చు.
  • ”నీ వేదనను అధికంగా విస్తరింపచెయ్యడం” అనే మాటను “నీ బాధ మరింత తీవ్రంగా అయ్యేలా చెయ్యడం” లేదా “నీవు మరింత బాధను అనుభవించేలా చెయ్యడం” అని అనువదించవచ్చు.
  • ”గుర్రాలను విస్తరంచడం” అంటే “దురాశతో ఎక్కువ గుర్రాలను సంపాదించుకుంటూ ఉండడం” లేక “అధిక సంఖ్యలో గుర్రాలను పొందడం” అని అర్థం.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3254, H3527, H6280, H7231, H7233, H7235, H7680, G4052, G4129