te_tw/bible/other/mock.md

5.1 KiB

యెగతాళి, యెగతాళి చెయ్యడం, యెగతాళి చేసారు, యెగతాళి చేస్తూండడం, యెగతాళి చేయువాడు, అపహాస్యం, అపహాస్యం, అపహాస్యం చెయ్యడం, వెక్కిరింత, వెక్కిరించడం

నిర్వచనం:

“యెగతాళి,” “అపహాస్యం” అంటే ఒకరిని ప్రత్యేకంగా క్రూరమైన విధానంలో ఆటపట్టించడం అని అర్థం.

  • యెగతాళి చెయ్యడంలో ఇతరులను ఇబ్బంది పెట్టేలా లేక వారిపట్ల అవమానాన్ని చూపేలే వారి మాటలనూ, వారి చర్యలను అనుకరించడం ఉంటుంది.
  • రోమా సైనికులు యేసు మీద ఒక వస్త్రాన్ని వేసి, రాజులా ఆయన్ను గౌరవించినట్లు నటించడం ద్వారా ఆయనను యెగతాళి చేసారు లేక అపహాస్యం చేసారు.
  • ఒక యవనస్తుల గుంపు ఎలీషాను పేరు పెట్టి పిలవడం, అతని బోడి తలను ఆటపట్టిస్తూ అపహాస్యం చేసారు, ఆయనను వెక్కిరించారు,
  • ”వెక్కిరించడం” అంటే నమ్మదగిన లేక ప్రాముఖ్యమైనదిగా పరిగణించని తలంపును కూడా యెగతాలి చెయ్యడం అని అర్థం. “అపహాసకుడు” నిత్యమూ యెగతాళి చేస్తుంటాడు, వెక్కిరిస్తుంటాడు.

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 21:12 మనుష్యులు యేసు మీద ఉమ్మివేస్తారని యెగతాళి చేస్తారని, మెస్సీయను కొడతారని ప్రవచించారు.
  • 39:05”ఆయన చనిపోవడానికి అర్హుడు” అని యూదా నాయకులందరూ జవాబిచ్చారు. అప్పుడు వారు యేసు కళ్ళకు గంతలు కట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, యెగతాళి చేసారు.
  • 39:12 సైనికులు ఆయనను కొరడాలతో కొట్టారు, ఊదారంగు వస్త్రాన్ని తొడిగారు, ముళ్ళ కిరాతాన్ని ఆయన మీద ఉంచారు. అప్పుడు వారు “యూదుల రాజా మా వైపు చూడు” అంటూ ఆయనను యెగతాళి చేసారు.
  • 40:04 యేసు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువవేయబడ్డాడు. వారిలో ఒకడు యేసును యెగతాళి చేసాడు, అయితే మరొకడు, “నీవు దేవునికి భయపడవా” అని అతనిని గద్దించాడు.
  • 40:05 యూదా నాయకులు, సమూహంలో ఉన్న ప్రజలందరూ యేసును యెగతాళి చేసారు. “నీవు దేవుని కుమారుడవైతే సిలువమీద నుండి తిగిరా, నిన్ను నీవు రక్షించుకో” అప్పుడు మేము విశ్వసిస్తాము” అని చెప్పారు.

పదం సమాచారం:

  • Strong's: H1422, H2048, H2049, H2778, H2781, H3213, H3887, H3931, H3932, H3933, H3934, H3944, H3945, H4167, H4485, H4912, H5058, H5607, H5953, H6026, H6711, H7046, H7048, H7814, H7832, H8103, H8148, H8437, H8595, G1592, G1701, G1702, G1703, G2301, G2606, G3456, G5512