te_tw/bible/other/imitate.md

2.4 KiB

అనుకరించు, అనుకరించువాడు

నిర్వచనం:

"అనుకరించు,” “అనుకరించువాడు" పదాలు ఎదుటి వ్యక్తి చేసేదానిలా ఖచ్చితంగా చెయ్యడం ద్వారా వారిని అనుకరించడాన్ని సూచిస్తుంది.

  • యేసు చేసినట్లుగా దేవునికి విధేయత చూపుతూ, ఇతరులను ప్రేమించడం ద్వారా యేసు క్రీస్తును క్రైస్తవులు అనుకరించాలని పౌలు బోధించాడు.
  • అపోస్తలుడు పౌలు తాను క్రీస్తును అనుకరించినట్టే ఆదిమ సంఘం తనను అనుకరించాలని చెప్పాడు.

అనువాదం సూచనలు:

  • "అనుకరించు" పదం "ఒకే విషయాలను చెయ్యడం” లేదా “అతని మాదిరిని అనుసరించడం" అని అనువదించబడవచ్చు.
  • "దేవుణ్ణి అనుకరించువారుగా ఉండండి” అనే పదబంధం "దేవుడు చేసినట్టుగా చేసే ప్రజలుగా ఉండండి" లేదా "దేవుడు చేసే పనులను చేసే ప్రజలుగా ఉండండి" అని అనువదించబడవచ్చు.
  • "మమ్మల్ని అనుకరించువారు అయ్యారు" అనే వాక్యం "నీవు మా మాదిరిని అనుసరించావు" లేదా "దైవసంబంధమైన క్రియలు మేము చెయ్యడం నువ్వు చూసి వాటినే నువ్వు చేస్తున్నావు" అని అనువదించబడవచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H310, H6213, G1096, G2596, G3401, G3402, G4160