te_tw/bible/other/gate.md

3.5 KiB

తలుపు, ద్వారాలు, గేటు అడ్డ కర్రలు, ద్వారపాలకుడు, ద్వారపాలకులు, ద్వారబంధాలు, ప్రవేశం.

నిర్వచనం:

"గేటు" అంటే ఒక ఇల్లు, లేక పట్టణం చుట్టూ ఉండే గోడలో ఉన్న ప్రవేశం. ఇది బందులపై తిరిగే కొయ్యతో చేసిస్ నిర్మాణం. "తలుపు కమ్ము" అంటే కొయ్యతో లేక లోహంతో చేసిన కర్ర. దీన్ని గేటును బిగించడానికి అమరుస్తారు.

  • పట్టణం గేటు ను తెరిచి ప్రజలు, జంతువులు, సామాను పట్టణంలోకి రానిస్తారు.
  • పట్టణం భద్రత కోసం దాని గోడలు, ద్వారాలు మందంగా బలమైనవిగా చేస్తారు. ద్వారాలను లోహంతో లేక కొయ్యతో చేసిన కడ్డీ అడ్డంగా పెట్టి శత్రు సైనికులు పట్టణంలోకి ప్రవేసించకుండా నిరోధిస్తారు.
  • పట్టణం గేటు తరచుగా పట్టణానికి సమాచార, సాంఘిక కేంద్రం. వ్యాపార లావాదేవీలు, తీర్పులు ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే పట్టణం గోడలు మందంగా ఉండి రాకపోకలకు అనువుగా సూర్యరశ్మి నుండి రక్షణగా చల్లని నీడ ఇస్తాయి. పౌరులు ఆహ్లాదకరమైన ఈ నీడలో కూర్చుని వారి వ్యాపారాలు, ఇంకా న్యాయ, చట్ట పరమైన వివాదాలు తీర్చుకుంటారు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులతో దీన్ని అనువదించవచ్చు. "గేటు" అంటే "తలుపు” లేక “గోడలో గుండా ప్రవేశం” లేక “ద్వారబంధం” లేక “ప్రవేశ ద్వారం."
  • "గేటు అడ్డు కర్రలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గేటు బోల్టులు” లేక “తలుపు బిగించడానికి కొయ్యతో చేసిన దూలాలు” లేక “గేటును బంధించడానికి లోహపు కడ్డీలు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440