te_tw/bible/other/elder.md

3.0 KiB

పెద్ద, వృద్ధలు, పాతది

నిర్వచనం:

"పెద్ద" లేదా "వృద్ధులు" పదం సమాజంలో పరిణతిగల పెద్దలుగానూ నాయకులుగానూ మారడానికి సరిపడిన వయసుకు ఎదిగిన ప్రజలను (బైబిలు సాధారణంగా పురుషులు) సూచిస్తుంది. ఉదాహరణకు, వృద్ధులకు నెరసిన వెంట్రుకలు ఉంటాయి, వయోజనులైన పిల్లలు ఉంటారు, లేదా మనుమ సంతానం ఉంటారు లేదా మునిమనుమ సంతానం ఉంటారు.

  • "పెద్ద" పదం పెద్దలు సహజంగా వారి వయసు, అనుభావం, గొప్ప దర్శనం కలిగియుండడం కారణంగా వారు పెద్దలుగా ఉంటారనే వాస్తవం నుండి వచ్చింది.
  • పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులను సామాజిక న్యాయం, మోషే ధర్మశాస్త్రం విషయాలలో నడిపించడానికి పెద్దలు సహాయపడ్డారు.
  • కొత్త నిబంధనలో యూదు "పెద్దలు" వారి సమాజంలో పెద్దలుగా ఉండడం కొనసాగించారు, ప్రజలకు న్యాయం తీర్చే వారుగా ఉన్నారు.
  • ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ "పెద్దలు" స్థానిక విశ్వాసుల సంఘాలలో ఆత్మ సంబంధమైన నాయకత్వం ఇచ్చారు. ఈ సంఘాలలోని పెద్దలలో ఆత్మ సంబంధమైన పరిణతి గల యువకులు కూడా ఉన్నారు.* ఈ పదం "వృద్ధులైన పురుషులు" లేదా "సంఘాన్ని నడిపిస్తున్న ఆత్మీయ పరిణతగల పురుషులు" అని అనువదించబడవచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850