te_tw/bible/other/dove.md

2.8 KiB

గువ్వ, పావురం

నిర్వచనం:

గువ్వలు, పావురాళ్ళు రెండు రకాల ఒకే విధమైన చిన్న, బూడిద రంగు-గోధుమ రంగు పక్షులు. గువ్వ తరచుగా మరింత తెల్లగా ఉండవచ్చు.

  • కొన్ని భాషల్లో వీటికి రెండు వివిధ పేర్లు ఉండగా కిన్ని భాషల్లో రెండు పేర్లు ఉన్నాయి.
  • గువ్వలు, పావురాళ్ళను దేవునికి బలి అర్పణల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెద్ద జంతువులను తేలేని మనుషులు వీటిని తెస్తారు.
  • గువ్వ వరద నీరు కొద్దిగా ఇంకుతూ ఉండగా ఒలీవ చెట్టు ఆకును నోవహు దగ్గరకు తెచ్చింది.
  • గువ్వలు కొన్ని సార్లు స్వచ్ఛత, నిర్దోషత్వం, లేక శాంతికి సంకేతం.
  • గువ్వలు, పావురాళ్ళు అనే పేర్లు అనువాదం చేస్తున్న భాషలో లేకపోతే ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గువ్వ అనే పేరుగల చిన్న బూడిద రంగు గోధుమ రంగు పక్షి” లేక “ఒకే విధమైన చిన్న బూడిద రంగు లేక గోధుమ రంగు స్థానిక పక్షులు."
  • గువ్వ, పావురం ఒకే వచనంలో వస్తే వీలైతే రెండు వేరు వేరు మాటలు ఈ పక్షులకు ఉపయోగించాలి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ఒలీవ, నిర్దోష, శుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1469, H1686, H3123, H8449, G4058