te_tw/bible/other/devastated.md

2.3 KiB

పాడు చేయు, పాడు చేసిన, నాశనకరం, వినాశనం, వినాశనాలు

నిర్వచనం:

"పాడు చేయు” లేక “వినాశనం" అనే మాట ఒకరి ఆస్తిని గాని దేశాన్ని గాని శిథిలం, లేక నాశనం చేయడాన్ని సూచిస్తున్నది. తరచుగా దీన్ని ఒక దేశ ప్రజలను బంధించడం, లేక నాశనం చెయ్యడాన్ని సూచించడానికి వాడతారు.

  • ఇది అత్యంత తీవ్రమైన సంపూర్ణ నాశనాన్ని సూచిస్తున్నది.
  • ఉదాహరణకు, సొదోమ పట్టణం అందులోని ప్రజల పాపాల మూలంగా దేవుని శిక్షకు లోనై ధ్వంసం అయింది.
  • "వినాశనం" అనే దాన్ని శిక్ష, లేక నాశనం మూలంగా కలిగే గొప్ప మానసిక వ్యధను సూచించ డానికి కూడా వాడతారు.

అనువాదం సలహాలు

  • "పాడు చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్తిగా నాశనం” లేక “పూర్తిగా శిథిలం."
  • సందర్భాన్ని బట్టి, "వినాశనం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్ణ నాశనం” లేక “సంపూర్ణ శిథిలం” లేక “ముంచెత్తే వ్యధ” లేక “విపత్తు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1110, H1238, H2721, H1826, H3615, H3772, H7701, H7703, H7722, H7843, H8074, H8077