te_tw/bible/other/deer.md

2.0 KiB

జింక, దుప్పి, ఆడ జింకలు, మగ లేడి, మగ లేళ్ళు

నిర్వచనం:

జింక అందమైన పెద్ద నాలుగు-కాళ్ళ జంతువు. అడవుల్లో కొండల్లో ఉంటుంది. మగ జంతువు పెద్దదిగా తలపై కొమ్ములుగలిగి ఉంటుంది.

  • "దుప్పి" అనేది జింక జాతిలోనే అలాటి వేరొక జంతువు.
  • మగ జింకను చెప్పడానికి ఇంగ్లీషులో లాగా వేరొక మాట తెలుగులో లేదు.
  • ఇంగ్లీషులో అయితే దుప్పులు జింకలు, లేళ్ళు, అడవి, మగవి చిన్న పిల్లలు, ఇలా రకరకాల ఇదమిద్ధమైన పేర్లు ఉన్నాయి.
  • జింక తన బలమైన, సన్నని కాళ్ళ సాయంతో ఎత్తుగా ఎగురుతూ వడిగా పరిగెడుతుంది.
  • వాటి కాళ్ళకు చీలిన డెక్కలు ఉంటాయి. వాటి సహాయంతో అన్ని రకాల నేలల్లో తేలికగా నడవడం, ఎక్కడం చేస్తుంది.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H354, H355, H365, H3180, H3280, H6643, H6646