te_tw/bible/other/bribe.md

2.4 KiB

లంచం, లంచాలు, లంచం ఇవ్వడం, లంచగొండితనం

నిర్వచనం:

"లంచం" అంటే ఎవరికైనా ఏదైనా విలువైనది అంటే డబ్బు ఇచ్చి ఆ వ్యక్తిని ఏదైనా అవినీతి కార్యం చెయ్యమని ప్రేరేపించడం.

  • యేసును ఉంచిన ఖాళి సమాధి దగ్గర కాపలా ఉన్న సైనికులకు లంచం ఇచ్చి జరిగిన దాన్ని గురించి అబద్ధం చెప్పమని ప్రేరేపించారు.
  • కొన్ని సార్లు ప్రభుత్వం అధికారికి లంచం ఇవ్వడం ద్వారా అతడు అక్కడ జరిగిన నేరాన్ని పట్టించుకోకుండా చేసేలా చేస్తారు. లేక ఒకరికి అనుకూలంగా తీర్పు ఇమ్మని ప్రేరేపిస్తారు.
  • బైబిల్ లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నిషేధిస్తున్నది.
  • "లంచం" అనే పదాన్ని ఇలా అనువదించ వచ్చు. "అవినీతి చెల్లింపు” లేక “అబద్ధమాడడానికిచెల్లింపు” లేక “తీర్పులను ఉల్లంఘించడానికి."
  • "లంచం" అనే దాన్ని ఒక పదం లేక పదబంధంతో అనువదించడం. "ప్రేరణ (ఎవరికైనా) కలిగించడానికి” లేక “అవినీతికరమైన ఉపకారం కోసం” లేక “ఉపకారం నిమిత్తం వెల చెల్లించు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3724, H4979, H7809, H7810, H7936, H7966, H8641, G5260