te_tw/bible/other/bow.md

3.7 KiB

వంచు, సాగిల పడు, వంగిన, వంగుట, నేలకు వంగుట, నేలకు వంగి,

నిర్వచనం:

వంగుట అంటే వినయంగా, ఎదుటి వ్యక్తి పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తపరచడం కోసం తన వంగి నమస్కారం చెయ్యడం. "నేలకు వంగుట" అంటే సాగిల పడి, మోకరించి తరచుగా ముఖం, చేతులు నేలకు ఆనించడం.

  • ఇతర మాటలు. "మోకాలు వంచు" (అంటే మోకరించు) "శిరస్సు వంచి" (అర్థం శిరస్సు వినయపూర్వకంగా, లేక సంతాపపూర్వకంగా వంచి).
  • వంగడం అనేది దుఃఖానికి సంతాపానికి సూచన. ఎవరినైనా "సాగిలపడడం" అంటే పూర్తిగా లొంగి వినయం చూపడం.
  • తరచుగా ఒక వ్యక్తి ఎవరైనా రాజులు, ఇతర అధిపతుల వలె ఉన్నత స్థాయి, లేక తనకన్నా ఎక్కువ హోదా, ప్రాముఖ్యత గొప్ప పదవి అలాటివి ఉంటే వారికి మొక్కుతాడు.
  • దేవుని ఎదుట సాగిలపడడం అనే మాటకు అర్థం ఆయనకు ఆరాధన చేయడం.
  • బైబిల్లో, ప్రజలు యేసు చేసిన అద్భుతాలు,అయన బోధ చూసి అయన దేవుని నుండి వచ్చాడని గ్రహించి ఆయనకు సాగిల పడ్డారు.
  • యేసు ఒక దినాన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తన మోకాళ్ళు వంచి ఆయనకు ఆరాధన చేస్తారని బైబిల్ చెబుతున్నది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఒక పదం లేక పదబంధం సాయంతో అనువదించ వచ్చు. "నెలకు ముఖం ఆనించి” లేక తల వంచి” లేక “మోకరించు."
  • ఈ పదం "నేలకు వంగుట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మోకరించు” లేక “సాష్టాంగపడడం."
  • కొన్ని భాషల్లో సందర్భాన్ని బట్టి అనువాదంలో వాడగలిగిన పదాలు ఉంటాయి.

(చూడండి: వినయపూర్వకమైన, ఆరాధన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H86, H3721, H3766, H5186, H5753, H5791, H6915, H7743, H7812, H7817, G1120, G2578, G2827, G4098, G4781, G4794