te_tw/bible/other/biblicaltimewatch.md

2.4 KiB

కావలి (బైబిల్ సమయం), కావలివారు

నిర్వచనం:

బైబిల్ కాలంలో, "కావలి" ఒక రాత్రి సమయం. కావలి మనిషి లేక రక్షక భటుడు ఒక పట్టణానికి కావలిగా ఉండి శత్రువు వలన కలిగే ప్రమాదం కోసం కనిపెట్టి చూస్తూ ఉంటాడు.

  • పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులకు మూడు రకాల కావలివారు ఉండే వారు. "ఆరంభ " (సూర్యాస్తమయం నుండి రాత్రి 10 వరకు), "మధ్య" (రాత్రి 10 నుండి ఉదయం 2 వరకు), "ఉదయం" (తెల్లవారి 2 నుండి సూర్యోదయం వరకు).
  • కొత్త నిబంధనలో, యూదులు నాలుగు కావలిలు ఉండే రోమా పద్ధతి పాటించే వారు. "మొదటి" (సూర్యాస్తమయం నుండి రాత్రి 9 వరకు), "రెండవ" (రాత్రి 9 నుండి అర్థరాత్రి 12 వరకు), "మూడవ" (అర్థరాత్రి 12 అర్థ రాత్రి నుండి తెల్లవారి 3 వరకు), "నాలుగవ" (తెల్లవారి 3 నుండి సూర్యోదయం వరకు) కావలివారు.
  • దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సాయంత్రం చీకటి పడ్డాక” లేక “మధ్యరాత్రి” లేక “తెలతెలవారుతుండగా" -ఏ సమయం గురించి చెబుతున్నారో దాన్ని బట్టి.

(చూడండి: కావలి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H821, G5438