te_tw/bible/other/biblicaltimehour.md

2.7 KiB
Raw Permalink Blame History

గంట, గంటలు

నిర్వచనం:

"గంట"అనే పదాన్ని తరచుగా బైబిల్లో సమయం కొన్ని సంఘటనలు జరిగిన సమయం తెలపడానికి ఉపయోగిస్తారు. దీన్ని "ఆ సమయం” లేక “ఆ క్షణం"అని చెప్పేటందుకు అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.

  • యూదులు సూర్యోదయం మొదలుకుని (సుమారు ఉదయం 6 గంటలు) పగలు సమయాన్ని గంటల్లో లెక్కించారు. ఉదాహరణకు, "తొమ్మిదవ గంట"అంటే "మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం."
  • రాత్రివేళ గంటలను సూర్యాస్తమయం (సుమారు 6 గంటలు) మొదలుకుని లెక్కించారు. ఉదాహరణకు, "రాత్రి మూడవ గంట"అంటే ప్రస్తుత పధ్ధతి ప్రకారం "సాయంత్రం 9గటల ప్రాంతంలో."
  • బైబిల్లో సమయం ప్రస్తావనలు ప్రస్తుతం ఉన్న విధంగా కాదు. "సుమారు తొమ్మిది” లేక “దాదాపు ఆరు గంటలు"అని ఉపయోగిస్తారు.
  • కొన్ని అనువాదాలు "సాయంత్రం” లేక “ఉదయం వేళ” లేక “మధ్యాహ్నం పూట"అనే పదబంధాలను ఆ సమయం లేక ఆ రోజును సూచించడానికి ఉపయోగిస్తారు.
  • "ఆ గంటలో"అనే దాన్ని ఇలా అనువదించవచ్చు. "ఆ సమయంలో” లేక “ఆ క్షణంలో."
  • యేసుకు సంబంధించి, "తన సమయం"అని అనువదించిన దానికి అర్థం, "తన సమయం ఇంకా రాలేదు.” లేక “తనకై నియమించ బడిన సమయం వచ్చింది."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8160, G5610