te_tw/bible/names/redsea.md

3.3 KiB

రెల్లుల సముద్రము, ఎర్ర సముద్రము

వాస్తవాలు:

“రెల్లుల సముద్రము” అనే ఈ మాట ఐగుప్తు మరియు అరేబియా మధ్యన కనబడే నీటి ప్రాంతమైయున్నది. దీనిని ఇప్పుడు “ఎర్ర సముద్రము” అని పిలిచెదరు.

  • ఎర్ర సముద్రము చాలా పొడవైనది మరియు సన్ననిదైయున్నది. ఇది ఒక చెరువు లేక ఒక నదికంటే పెద్దది, అయితే ఒక సాగరముకంటే చాలా చిన్నదియైయున్నది.
  • ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రమును దాటవలసియుండెను. దేవుడు అద్భుతము ప్రదర్శించియున్నాడు మరియు సముద్రపు నీటిని రెండు పాయలుగా చేసియున్నాడు, తద్వారా ప్రజలు ఆరిన నేల మీద నడిచి వెళ్లిరి.
  • కానాను దేశము ఈ సముద్రమునకు ఉత్తర దిక్కునున్నది.
  • దీనిని “వెదురు సముద్రము” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: అరేబియా, కానాను, ఐగుప్తు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 12:04 ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల సైన్యము వచ్చుట చూచినప్పుడు, వారు ఫరో సైన్యము మరియు ఎర్ర సముద్రము మధ్యన ఇరుక్కుపోయామని తెలుసుకొనిరి.
  • 12:05ఎర్ర సముద్రము వైపునకు ప్రజలందరిని వెళ్ళమని చెప్పు” అని దేవుడు మోషేకు తెలియజేసెను.
  • 13:01 దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము ద్వారా నడిపించిన తరువాత, ఆయన వారిని సీనాయి అనే పర్వతము వద్దకు అరణ్యము ద్వారా నడిపించెను.

పదం సమాచారం:

  • Strong's: H3220, H5488, G2063, G2281