te_tw/bible/names/damascus.md

2.6 KiB

దమస్కు

వాస్తవాలు:

దమస్కు సిరియా దేశం ముఖ్య పట్టణం. బైబిల్ కాలాల్లోని నగరం ఉన్న చోటే నేటి నగరం కూడా ఉంది.

  • దమస్కు లోకంలో అత్యంత పురాతనమైన పట్టణం. అన్ని కాలాల్లోనూ దీనిలో జనాభా నివసించారు.
  • అబ్రాహాము కాలంలో, దమస్కు ఆరాము రాజ్యం రాజధాని (ఇది ఇప్పుడు సిరియాలో ఉంది).
  • పాత నిబంధన అంతటా దమస్కు నివాసులు, ఇశ్రాయేలు ప్రజల మధ్య లావాదేవీల ప్రస్తావనలు ఉన్నాయి.
  • దమస్కు నాశనం గురించి అనేక బైబిల్ ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు పాత నిబంధన కాలంలో అస్సిరియా వారు దీన్ని నాశనం చేయడంతో నెరవేరాయి. లేదా ఇది భవిషత్తులో పట్టణం పూర్ణ నాశనం తో నెరవేరవచ్చు.
  • కొత్త నిబంధనలో, పరిసయ్యుడు సౌలు (తరువాత పౌలు అనే పేరు వచ్చింది) ఈ నగర క్రైస్తవులను బాధించడానికి వెళుతుండగా యేసు అతణ్ణి ఎదుర్కొని అతడు విశ్వాసిగా మారేలా చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆరాము, అస్సిరియా, విశ్వసించు, సిరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1833, H1834, G1154