te_tw/bible/names/amorite.md

3.4 KiB

అమోరీయుడు, అమోరీయులు

వాస్తవాలు:

అమోరీయులు చాలా శక్తివంతమైన ప్రజ. నోవహు మనవడు కనాను వీరి పూర్వీకుడు.

  • వారి పేరుకు "ఉన్నతమైన," అని అర్థం. ఎందుకంటే వీరు కొండసీమల్లో నివసించారు. లేదా ఈ మనుషులు చాలా పొడవైన వారు అని పేరు పొందారు.
  • అమోరీయులు యోర్దాను నది రెండు వైపులా నివసించారు. హాయి పట్టణం నివాసులు అమోరీయులే.
  • దేవుడు "అమోరీయుల పాపం"ను ప్రస్తావించాడు. అబద్ధ దేవుళ్ళకు వారు చేసే పూజలు, దానికి అనుబంధంగా ఉన్న పాపపూరితమైన ఆచారాలు ఇందులో ఉన్నాయి.
  • యెహోషువా ఇశ్రాయేలీయుల నాయకుడుగా ఉండి దేవుడు అజ్ఞాపించినట్టు అమోరీయులను నాశనం చేశాడు.

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 15:07 కొంతకాలం తరువాత, కనానులోని అన్యజాతుల రాజులు అమోరీయులు, ఈ మాట విన్నారు. గిబియోను వారు ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందం చేసుకున్నారని విన్నారు. కాబట్టి వారి సేనలను ఒకే పెద్ద సైన్యంగా సమీకరించి గిబియోనుపై దాడి చేశారు.
  • 15:08 మరుసటి ఉదయం పెందలకడనే వారు అమోరీయుల సేనలపై మెరుపు దాడి చేశారు.
  • 15:09 దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు.

అయన అమోరీయులు కలవరపడేలా గొప్ప వడగళ్ళు కురిపించి అనేక మంది __అమోరీయులను__హతమార్చాడు.

  • 15:10 అంతేకాక దేవుడు ఆనాడు సూర్యుడు ఆకాశంలో ఒకే చోట నిలిచిపోయేలా చేసి ఇశ్రాయేలు వారు అమోరీయులను పూర్తిగా ఓడించేలా చేశాడు .

పదం సమాచారం:

  • Strong's: H567,