te_tw/bible/kt/woe.md

3.8 KiB

అయ్యో

నిర్వచనము:

“అయ్యో” అనే పదము గొప్ప బాధతో కూడిన భావమును సూచించును. ఎవరైనా ఏదైనా అతీ తీవ్రమైన అపాయమును అనుభవిస్తారని చెప్పే హెచ్చరికను కూడా ఈ పదము తెలియజేయుచున్నది.

  • ప్రజలు తమ పాపములనుబట్టి పొందుకునే శిక్షగా వారు అనుభవించే శ్రమలను ప్రజలకు హెచ్చరికగా “అయ్యో” అనే పదమును జతపరిచి వ్యక్తపరుస్తారు.
  • పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో భయానకమైన తీర్పును నొక్కి చెప్పుటకు “అయ్యో” అనే పదము పునరావృతం అయ్యుంటుంది.
  • “అయ్యో నేను” లేక “అయ్యో నాకు” అనే మాటలను ఒక వ్యక్తి చెబుతున్నాడంటే అతి తీవ్రమైన శ్రమను గుర్చిన బాధను వ్యక్తపరచుకోవడం అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “అయ్యో” అనే పదము కూడా “గొప్ప బాధ” లేక “దుఃఖము” లేక “విపత్తు” లేక “ఉపద్రవం” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “(ఏదైనా పట్టణము పేరు చెప్పి) అయ్యో” అని చెప్పిన మాటను తర్జుమా చేయు అనేక విధానములలో “(ఆ పట్టణము) కొరకు జరగబోయేది ఎంత భయానకము” లేక “(పట్టణములో) ప్రజలు భయంకరముగా శిక్షించబడుదురు) లేక “చాలా భయంకరముగా ఆ ప్రజలు శ్రమిస్తారు” అనే మాటలను కూడా చేర్చుదురు.
  • “అయ్యో నేను!” లేక “అయ్యో నాకు!” అనే ఈ మాటను “నేను ఎంత దౌర్భాగ్యుడను!” లేక “నేను దౌర్భాగ్యుడను!” లేక “నాకు కలిగింది ఎంత భయానకము!” అని కూడా తర్జుమా చేయకూడదు.
  • “అయ్యో నీకు” అనే మాటను “నీవు భయంకరముగా శ్రమపడుతావు” లేక “నీవు భయంకరమైన శ్రమలను అనుభవిస్తావు” అని తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H188, H190, H337, H480, H1929, H1945, H1958, G3759