te_tw/bible/kt/test.md

4.6 KiB

పరీక్ష, పరీక్షలు, పరీక్షించు

నిర్వచనం:

ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు బయట పెట్టే దుర్లభం లేక బాధాకరమైన అనుభవాన్ని "పరీక్ష" అనే పదం సూచిస్తున్నది.

  • దేవుడు తన ప్రజలను పరీక్షలకు గురి చేస్తాడు., అయితే ఆయన పాపం చేసేలా శోధించడు. సాతాను అయితే ప్రజలను పాపం చేసేలా శోధించుతాడు.
  • దేవుడు కొన్ని సార్లు మనుషుల పాపం బయట పెట్టేటందుకు పరీక్షలు పెడతాడు. పరీక్ష ఒక వ్యక్తిని పాపం నుండి పాపం తొలగించి దేవునికి దగ్గర చెయ్యడానికి ఉపయోగ పడుతుంది.
  • బంగారం, ఇతర లోహాలు అగ్ని పరీక్ష మూలంగా అవి ఎంత శుద్ధమైనవో దృఢమైనవో తెలుస్తాయి. దేవుడు బాధాకరమైన పరిస్థితులను తన ప్రజలను పరిక్షించడానికి వాడుకుంటాడు.
  • "పరీక్షకు గురి చెయ్యడం" అంటే, "దేన్నైనా లేక ఎవరినైనా వారి విలువైను రుజువు చెయ్యడానికి" పూనుకోవడం.
  • దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యడం అనే సందర్భంలో ఆయనను మన కోసం ఒక అద్భుతం చేసేలా అడగడం. ఇది తన కరుణను అలుసుగా తీసుకోవడమే..
  • దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యకూడదని యేసు సాతానుతో చెప్పాడు. దేవుడు సర్వ శక్తిమంతుడు, అయన అన్నిటికీ ప్రతివారికీ పైగా ఉన్న పరిశుద్ధ దేవుడు.

అనువాదం సలహాలు:

  • "పరీక్ష" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సవాలు” లేక “కష్టాలు అనుభవించేలా చెయ్యడం” లేక “చేవ ఎలాటిదో చూడడం."
  • "పరీక్ష" అనే దాన్ని అనువదించడం, "సవాలు” లేక “కష్ట తరమైన అనుభవం ."
  • "పరీక్షకు గురి చెయ్యడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరీక్ష” లేక “సవాలు విసరడం” లేక “తనను రుజువు చేసుకొమ్మని చెప్పడం."
  • దేవుణ్ణి ఈ సందర్భంలో పరీక్షిస్తున్నాడు అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "దేవుడు తన ప్రేమ రుజువు చేసుకొమ్మని చెప్పడం."
  • కొన్నిసందర్భాల్లో దేవుడు "పరీక్ష" పెడుతున్నప్పుడు కాకపోతే "శోధించు" అనే అర్థం వస్తుంది.

(చూడండి: శోధించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020