te_tw/bible/kt/saint.md

2.7 KiB

పరిశుద్ధుడు, పరిశుద్ధులు

నిర్వచనము:

“పరిశుద్ధులు” అనే ఈ మాటకు “పవిత్రులైనవారు” అని అక్షరార్థము కలదు మరియు యేసునందు విశ్వసించినవారిని సూచిస్తుంది.

  • ఆ తదుపరి సంఘ చరిత్రలో ఒక వ్యక్తి తాను చేసిన మంచి కార్యముల కొరకు తనకు “పరిశుద్ధుడు” అనే బిరుదును ఇచ్చెడివారు, కాని క్రొత్త నిబంధన కాలములో ఈ పదమును ఆ విధముగా ఉపయోగించెడివారు కాదు.
  • యేసునందు విశ్వసించినవారు పరిశుద్ధులు లేక పవిత్రులైనవారైయున్నారు, వారు చేసిన కార్యములను బట్టి కాదు గాని, యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యమునందు వారు విశ్వాసమును బట్టి వారు పరిశుద్ధులైయున్నారు. ఆయానే వారిని పరిశుద్ధులనుగా చేయువాడైయున్నాడు.

తర్జుమా సలహాలు:

  • “పరిశుద్ధులు” అని తర్జుమా చేయుటలో “పవిత్రులైనవారు” లేక “పరిశుద్ధ ప్రజలు” లేక “యేసునందు పరిశుద్ధ విశ్వాసులు” లేక “ప్రత్యేకించబడినవారు” అని కూడా చేర్చవచ్చును.
  • ఒక క్రైస్తవ గుంపుకు సంబంధించిన ప్రజలను మాత్రమె సూచించే పదమును వాడకుండా జాగ్రత్తపడండి.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2623, H6918, H6922, G40