te_tw/bible/kt/remnant.md

3.2 KiB

శేషము

నిర్వచనము:

“శేషము” అనే పదము అక్షరార్థముగా ఒక పెద్ద గుంపునుండి లేక జనసంఖ్య ఉన్నటువంటి ప్రజలనుండి “విడువబడిన” లేక “మిగిలిపోయిన” వస్తువులనుగాని లేక ప్రజలనుగాని సూచించును.

  • అనేకమార్లు “శేషము” అనే ఈ పదము అనేక శ్రమల ద్వారా దేవునికి విధేయత చూపిన కొద్దిమందిని లేక అపాయకరమైన పరిస్థితి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న ప్రజలను సూచిస్తుంది.
  • కానానులోని వాగ్ధాన దేశమునకు తిరిగి జీవించుటకు మరియు బయటవారినుండి అనేక దాడులను ఎదుర్కొనుచు జీవిస్తున్న శేష జనాంగముగా యూదుల గుంపును యెషయా సూచించియున్నాడు.
  • దేవుని కృపను పొందుకొనుటకు ఆయన ద్వారా ఎన్నుకొనబడిన “శేషించబడిన” ప్రజలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.
  • “శేషము” అనే ఈ పదము నమ్మకముగా ఉండని లేక నమ్మకముగా జీవించని లేక ఎన్నుకొనబడని ఇతర ప్రజలను సూచించుటకు ఉపయోగించబడియున్నది.

తర్జుమా సలహాలు:

“ఈ ప్రజల శేషము” అనేటువంటి ఈ మాట “మిగిలిన ఈ ప్రజలు” లేక “నమ్మకముగా ఉండిన ప్రజలు” లేక “విడువబడిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయుదురు.

  • “శేషించబడిన ప్రజలందరు” అనే ఈ మాటను “మిగిలిన ప్రజలందరు” లేక “శేషించబడిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3498, H3499, H5629, H6413, H7604, H7605, H7611, H8281, H8300, G2640, G3005, G3062