te_tw/bible/kt/perish.md

2.8 KiB

నశించు, నశించెను, నశించుట, నశించిపోయే

నిర్వచనము:

“నశించు” అను పదమునకు మరణించుట లేక పాడైపోవుట, సహజముగా విపత్తులు లేక హింసాత్మక సంఘటనల ప్రతిఫలమును సూచించును. పరిశుద్ధ గ్రంథములో దీనికి విశేషముగా నరకములో నిత్యము శిక్షనొందుటయను అర్థమును కలిగియుండును.

  • “నశించిపోవు” జనులందరూ నరకానికి పాత్రులైయున్నారు, ఎందుకంటే వారు తమ రక్షణ కొరకు యేసునందు విశ్వాసముంచుటను తిరస్కరించియున్నారు.
  • యోహాను.3:16వ వచనము “నశించుట” అనగా పరలోకములో నిత్యమూ నివసించకుండుట అనే అర్థమును తెలియజేయుచున్నది.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుగుణముగా, ఈ పదమును అనువాదము చేయు ఇతర విధానములలో “నిత్య మరణమును పొందుట” లేక “నరకములో శిక్షించబడుట” లేక “నాశనమగుట” అనే మాటలను ఉపయోగించుదురు.
  • “నశించు” అనే తర్జుమా కేవలము “ఉనికిలో ఉన్నట్లుగా” మాత్రమెగాకుండా, నరకములో నిత్యమూ ఉండుటను గూర్చి అర్థము ఇచ్చులాగున చూసుకొనుడి.

(ఈ పదములను ఒకసారి చూడండి: మరణము, నిత్యమూ)

పరిశుద్ధ గ్రంథములోని అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6, H7, H8, H1478, H1820, H5486, H5595, H6544, H8045, G599, G622, G684, G853, G1311, G2704, G4881, G5356