te_tw/bible/kt/parable.md

2.7 KiB

ఉపమానము, ఉపమానములు

నిర్వచనము:

“ఉపమానము” అనే పదము సహజముగా నైతిక సత్యాన్ని బోధించుటకు లేక వివరించుటకు ఉపయోగించే నీతి పాఠమును లేక చిన్న కథను సూచిస్తుంది.

  • యేసు తన శిష్యులకు బోధించుటకు ఉపమానములను ఉపయోగించెను. ఆయన జనసమూహములకు ఉపమానములు ఉపయోగంచి చెప్పినప్పటికిని, ఆయన ఉపమానమునంతటిని వివరించలేదు.
  • యేసునందు విశ్వసించని పరిసయ్యులలాంటి జనులకు సత్యమును గ్రహించకుండ మరుగు చేయుటకు, తన శిష్యులకు మాత్రమె సత్యాన్ని బయలుపరచుటకు ఉపమానమును ఉపయోగించియుండవచ్చును.
  • దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదో తెలియజేయుటకు ప్రవక్తయైన నాతాను దావీదు ఒక ఉపమానమును తెలియజెప్పెను.
  • మంచి సమరయుని కథ అనునుది ఒక కథగా ఉపమానమునకు ఒక ఉదాహరణ. యేసు పోల్చి చెప్పిన ద్రాక్షారస పాత క్రొత్త తిత్తులు కూడా తన శిష్యులు యేసు బోధను అర్థము చేసుకోవడానికి సహాయము చేసే నీతి పాఠములాంటి ఉపమానమునకు ఒక ఉదాహరణయైయున్నది.

(ఈ పదాలను కూడా చూడండి: సమరయ)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H1819, H4912, G3850, G3942