te_tw/bible/kt/mosthigh.md

2.4 KiB

సర్వోన్నతుడు

వాస్తవాలు:

“సర్వోన్నతుడు” అనే పదం దేవునికి బిరుదు. ఇది ఆయన గొప్పతనాన్ని లేక అధికారాన్ని సూచిస్తుంది.

  • ఈ పదం అర్థం “సార్వభౌముడు” లేక “సర్వాదికారి” అనే పదాల అర్థం ఒకేలా ఉంటుంది.
  • ఈ బిరుదులో ”ఉన్నతమైన” అనే పదం భౌతిక ఎత్తును గానీ లేదా దూరాన్ని గానీ సూచించడం లేదు. గొప్పతనాన్ని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని “సర్వోన్నతుడైన దేవుడు” లేక అత్యంత సర్వాదికారి దేవుడు” లేక “ఉన్నతుడైన దేవుడు” లేక “అత్యంత గొప్పవాడు” లేక “సర్వాదికారియైన వాడు” లేక “అందరికంటే గొప్పవాడైన దేవుడు” అని అనువదించవచ్చు.
  • ”ఉన్నతుడు” లాంటి పదం వినియోగించినప్పుడు, అది భౌతికమైన ఎత్తు లేక పొడవులను సూచించేదిగా ఉండకూడదు.

(చూడండి: దేవుడు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5945, G5310