te_tw/bible/kt/mercy.md

6.4 KiB

కరుణ, కరుణగల

నిర్వచనం:

“కరుణ,” “కరుణగల” పదాలు అవసరతలో ఉన్న ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రత్యేకించి వారు తక్కువస్థితిలో గానీ లేదా అణచివేయబడిన స్థితిలో గానీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడాన్ని సూచిస్తున్నాయి.

  • ”కరుణ” అనే పదంలో మనుష్యులు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఉండడం అనే అర్థం కూడా ఉంది.
  • రాజులాంటి శక్తివంతమైన వ్యక్తి మనుష్యులకు హాని చెయ్యడానికి బదులు వారిని దయతో చూచినప్పుడు అతడు “కరుణగల” వ్యక్తి అని వర్ణించబడతాడు.
  • కరుణకలిగి యుండడం అంటే మనకు విరోధంగా ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అనికూడా అర్థం ఉంది.
  • గొప్ప అవసరతలో ఉన్న ప్రజలకు మనం సహాయం చేసినప్పుడు మనం కరుణ చూపిస్తాము.
  • దేవుడు మన విషయంలో కరుణ కలిగి యున్నాడు, మనం ఇతరుల పట్ల కరుణ కలిగి యుండాలని ఆయన కోరుతున్నాడు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “కరుణ” అనే పదం “దయ” లేదా “కనికరం” లేదా “జాలి” అని అనువదించబడవచ్చు.
  • ”కరుణగల” అనే పదం “జాలి చూపించడం” లేదా “దయగా ఉండడం” లేదా “క్షమించడం” అని అనువదించబడవచ్చు.
  • ”కరుణ చూపించడం” లేక “కరుణ కలిగి యుండడం” అనే పదాలు “దయను చూపించు” లేదా “వారిపట్ల కనికరం కలిగి యుండు” అని అనువదించబడవచ్చు.

(చూడండి: కరుణ, క్షమించడం)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 19:16 వారు (ప్రవక్తలు) అందరూ విగ్రహాలను పూజించడం నిలిపివేయాలని ప్రజలకు చెప్పారు, ఇతరులకు న్యాయాన్నీ కరుణనూ చూపించడం ఆరంభించాలని చెప్పారు.
  • 19:17 అతడు (యిర్మియా) బావి అడుగుభాగంలోని మట్టిలోనికి కూరుకుపోయినప్పుడు రాజు అతని పట్ల కరుణ చూపించి యిర్మియా చనిపోకముందే అతనిని బావిలోనుండి బయటికి తీయాలని సేవకులకు ఆజ్ఞాపించాడు.
  • 20:12 పర్షియా రాజు బలమైనవాడు, అయితే తాను జయించిన ప్రజలపట్ల కరుణ చూపించాడు.
  • 27:11 అప్పుడు ప్రభువు ధర్మశాస్త్ర బోధకుడిని “నీవు ఏమి తలస్తున్నావు?” అని అడిగాడు. దోచుకోబడి, కొట్టబడిన ఈ వ్యక్తికి వారిలో ఎవరు పొరుగువాడు? “అతని పట్ల కరుణ చూపినవాడే” అని జవాబిచ్చాడు.
  • 32:11 అయితే యేసు అతనితో, “వద్దు, నీవు నీ ఇంటికి వెళ్లి నీ స్నేహితులతోనూ, నీ కుటుంబంతోనూ దేవుడు నీ పట్ల చేసిన సమస్తాన్ని చెప్పు, ఆయన నీమీద ఏవిధమైన కరుణ చూపించాడో చెప్పు” అని చెప్పాడు.
  • 34:09”అయితే సుంకరి మతనాయకునికి దూరంగా నిలిచి, పరలోకం వైపు తలెత్తడానికికూడా ధైర్యం లేక, రొమ్ముమీద కొట్టుకొనుచు, “దేవా దయచేసి నా పట్ల కరుణ చూపు, ఎందుకంటే నేను పాపిని” అని ప్రార్థించాడు.

పదం సమాచారం:

  • Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698