te_tw/bible/kt/hypocrite.md

2.8 KiB

కపటి, కపటులు, కపట వేష ధారణ

నిర్వచనం:

"కపటి" అంటే న్యాయవంతుడుగా కనిపిస్తూ రహస్యంగా దుష్ట మార్గాలకు అంగీకరించేవాడు. "కపట వేష ధారణ" అంటే మనుషులను మోసగిస్తూ తాను న్యాయవంతుడు అని వారు అనుకునేలా నటించడం.

  • కపటులు మంచి పనులు చేస్తూ ప్రజలు తమను మంచి వారు అనుకునేలా చెయ్యడం.
  • తరచుగా కపటి ఇతరులను తాము చేసే అదే పాపపూరితమైన పనులు చేసినందుకు విమర్శిస్తూ ఉంటాడు.
  • యేసు పరిసయ్యులను కపటులు అని పిలిచాడు. ఎందుకంటే వారు భక్తుల్లాగా కొన్ని రకాల వస్త్రాలు ధరించి కొన్ని రకాల ఆహారం తింటూ ఉంటారు గానీ మనుషుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు.
  • కపటి ఇతరుల్లో తప్పులు చూపిస్తాడు. అయితే తన స్వంత తప్పులు సరి దిద్దుకోడు.

అనువాదం సలహాలు:

  • కొన్ని భాషల్లో ఈ మాట "పయోముఖ విషకుంభం" వలే కపటులు తమ కపట క్రియలు చేస్తూ ఉంటారని తర్జుమా చెయ్యవచ్చు.
  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "మోస గాడు” లేక “నటన” లేక “అహంకారి, మోసకరమైన వ్యక్తి."
  • "కపట వేష ధారణ" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "కపటం” లేక “నకిలీ క్రియలు” లేక “నటించడం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H120, H2611, H2612, G505, G5272, G5273