te_tw/bible/kt/grace.md

3.3 KiB

కృప, కృపగల

నిర్వచనం:

"కృప" పదం సంపాదించని ఒకరికి ఇవ్వబడిన సహాయాన్నీ లేదా ఆశీర్వాదాన్నీ సూచిస్తుంది. "కృపగల" పదం ఇతరులకు కృపను చూపించు వ్యక్తిని వివరిస్తుంది.

  • పాపపూరితమైన మానవులకు దేవుని కృప ఒక వరముగా ఉచితంగా ఇవ్వబడింది.
  • కృప పదంలోని భావం చెడు కార్యాలు మరియు గాయపరచే కార్యాలు చేసిన వారితో దయతోనూ క్షమాపణతోనూ ఉండడం అని సూచిస్తుంది.
  • "కృప కనుగొను" అనే వ్యక్తీకరణ దేవుని నుండి సహాయాన్నీ, కరుణనూ పొందడం అనే అర్థాన్నిచ్చే వ్యక్తీకరణ. తరచుగా ఇందులో దేవుడు ఒకరి విషయంలో సంతోషించడం మరియు అతనికి సహాయం చెయ్యడం అనే అర్థం ఉంది.

అనువాదం సూచనలు:

  • "కృప" పదం "దైవికమైన దయ" లేదా "దేవుని దయ" లేదా "పాపుల కోసం దేవుని దయ మరియు క్షమాపణ" లేదా "కరుణపూరిత దయ" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "కృపగల" పదం "సంపూర్ణ కృప" లేదా "దయ" లేదా "కరుణ గల" లేదా కరుణతో కూడిన దయ" అని అనువదించబడవచ్చు.
  • "అతడు దేవుని దృష్టిలో కృపను పొందాడు" వ్యక్తీకరణ "అతడు దేవుని నుండి కరుణను పొందాడు" లేదా "దేవుడు అతనికి కరుణతో సహాయం చేశాడు" లేదా "దేవుడు తన దయను అతనికి చూపించాడు" లేదా "దేవుడు అతని విషయంలో సంతోషించాడు, అతనికి సహాయం చేసాడు" అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543