te_tw/bible/kt/forsaken.md

3.7 KiB

విడిచి పెట్టు, విడిచి పెట్టిన, విడువబడిన

నిర్వచనం:

"విడిచి పెట్టు" అంటే ఎవరినైనా వదిలి వెయ్యడం, లేక దేన్నైనా మానుకోవడం. "విడిచి పెట్టబడిన" అంటే ఒకరు వేరొకరిని వదిలెయ్యడం.

  • ప్రజలు దేవుణ్ణి "విడిచి పెట్టడం" అంటే వారు ఆయనను వదిలి నమ్మక ద్రోహం చేశారు అని అర్థం.
  • దేవుడు ప్రజలను "విడిచి పెట్టడం" అంటే అయన వారికి సహాయం చెయ్యడం మానుకున్నాడు. వారిని తిరిగి తన దగ్గరకు రప్పించడానికి వారు హింసలు అనుభవించేలా చేశాడు.
  • ఈ పదానికి వేరొక అర్థం కూడా ఉంది. కొన్నిటిని త్యజించడం, అంటే దేవుని బోధలను వదిలిపెట్టడం, లేక అనుసరించక పోవడం.
  • "విడిచి పెట్టిన" అనేదాన్ని భూత కాలంలో ఉపయోగిస్తారు. "అతడు నిన్ను విడిచి పెట్టాడు." లేక విడిచిపెట్ట బడిన ఎవరి గురించి అయినా చెప్పడానికి ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి ఈ పదం అనువదించడంలో ఇతర పద్ధతులు. "వదిలెయ్యడం” లేక “నిర్లక్ష్యం” లేక “చాలించుకోవడం” లేక “వదిలి వెళ్ళడం” లేక “దూరం వెళ్ళిపోవడం,"
  • దేవుని చట్టాన్ని "విడిచి పెట్టు" అనే మాటను ఇలా అనువదించ వచ్చు " దేవుని చట్టం ధిక్కరించు." ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. దేవుని బోధలు, ఆజ్ఞలు "విడిచి పెట్టడం” లేక “చాలించుకోవడం” లేక “లోబడడం మానుకోవడం."
  • "విడిచి పెట్టు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "పరిత్యజించు” లేక “వదిలి పెట్టు."
  • విడిచి పెట్టేది వస్తువునా లేక మనిషినా అనే దాన్ని బట్టి అనువదించడంలో వివిధ పదాలు ఉపయోగించాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,