te_tw/bible/kt/foolish.md

3.8 KiB

బుద్ధి హీనుడు, బుద్ధిలేని, మూర్ఖత్వం

నిర్వచనం:

"బుద్ధి హీనుడు" అనే పదం తరచుగా తప్పు ఎంపికలు చేసేవానిని సూచిస్తుంది. ముఖ్యంగా అవిధేయత చూపించడానికి యెంచుకోనేవానిని సూచిస్తుంది. "బుద్ధిలేని" పదం ఒక వ్యక్తి గానీ లేదా అతని ప్రవర్తన గానీ జ్ఞానంగా లేదని వర్ణిస్తుంది.

  • బైబిలులో "బుద్ధి హీనుడు" పదం సాధారణంగా దేవుణ్ణి విశ్వసించని లేదా దేవునికి విధేయత చూపని వ్యక్తిని సూచిస్తుంది, దేవుణ్ణి విశ్వసించే వ్యక్తినీ మరియు దేవునికి విధేయత చూపే వ్యక్తిని ఇది వ్యతిరేకిస్తుంది.

  • కీర్తనలలో, ఒక బుద్దిహీనుడు దేవుని విశ్వసించని వాడు, దేవుని సృష్టిలో ఆయన ఋజువు అంతటినీ తృణీకరించే వాడు అని దావీదు వర్ణిస్తున్నాడు.

  • పాత నిబంధన పుస్తకంలోని సామెతల గ్రంథం కూడా బుద్ధిలేనివాడు లేదా బుద్ధిహీనులు ఎవరు, ఎలా ఉంటారు అనే అనేక వివరణలు ఇస్తుంది.

  • "మూర్ఖత్వం" పదం అజ్ఞానంగా ఉండే కార్యాన్ని సూచిస్తుంది ఎందుకంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. తరచుగా "మూర్ఖత్వం" పదంలో హాస్యాస్పదంగానూ లేదా ప్రమాదకరంగానూ ఉండే అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది.

అనువాదం సూచనలు:

  • "బుద్ధి హీనుడు" పదం "బుద్ధిలేని వ్యక్తి" లేదా "అజ్ఞాని అయిన వ్యక్తి" లేదా "జ్ఞానం లేని వ్యక్తి" లేదా "దైవభక్తి లేని వ్యక్తి" అని అనువదించబడవచ్చు.
  • "బుద్ధిలేని" పదం "అవగాహన లోపం" లేదా "అజ్ఞాని" అని ఇతరవిధానాలలో అనువదించబడవచ్చు.

(చూడండి: తెలివిగల)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912