te_tw/bible/kt/faithless.md

2.6 KiB

విశ్వాసం లేని, విశ్వాస రాహిత్యం

నిర్వచనం:

"విశ్వాసం లేని" అంటే విశ్వాసం లోపం లేక విశ్వసించక పోవడం.

  • దేవునిపై విశ్వాసం లేని వారిని వర్ణించడానికి ఈ పదం ఉపయోగిస్తారు. వారి నమ్మకంలేమి వారి క్రియల్లో అనైతిక విధానాల్లో విశదం అవుతుంది.
  • ప్రవక్త యిర్మీయా ఇశ్రాయేలువారు విశ్వాసం లేకుండా దేవునికి అవిధేయత చూపుతున్నారని నేరం మోపాడు.
  • వారు విగ్రహాలను ఆరాధించి నిజ దేవునికి లోబడని, ఆయన్ని పూజించని ఇతర నిర్దేవ ప్రజల సమూహాల విధానాలు పాటించారు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "విశ్వాసం లేని" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అవిశ్వసనీయత” లేక “విశ్వసించని” లేక “దేవునికి అవిధేయత” లేక “నమ్మకం లేని."
  • "విశ్వాసరాహిత్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపనమ్మకం” లేక “అపనమ్మకత్వం” లేక “తిరుగుబాటు వ్యతిరేకంగా దేవుడు."

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: విశ్వసించు, విశ్వసనీయత, ధిక్కరించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G571